Telangana FSL: తెలంగాణ ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికలు ఇకపై న్యాయస్థానాల్లో సాక్ష్యాలు
ABN , Publish Date - Jun 05 , 2025 | 03:18 AM
తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ(ఎఫ్‌ఎస్‌ఎల్)కి మరో జాతీయ స్ధాయి గుర్తింపు లభించింది. డిజిటల్, ఎలకా్ట్రనిక్ సాక్ష్యాలను పరిశీలించడానికి, విశ్లేషించడానికి, ధ్రువీకరించడానికి కావాల్సిన చట్టపరమైన అధికారాన్ని...
ఐటీ చట్టం కింద అధికారాన్ని దఖలు పర్చిన కేంద్రం
హైదరాబాద్, జూన్ 4(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ(ఎఫ్‌ఎస్‌ఎల్)కి మరో జాతీయ స్ధాయి గుర్తింపు లభించింది. డిజిటల్, ఎలకా్ట్రనిక్ సాక్ష్యాలను పరిశీలించడానికి, విశ్లేషించడానికి, ధ్రువీకరించడానికి కావాల్సిన చట్టపరమైన అధికారాన్ని ఐటీ చట్టం-2000 సెక్షన్ 79ఏ క్రింద ఎఫ్‌ఎస్‌ఎల్‌కు దఖలు పరుస్తూ కేంద్ర ఎలకా్ట్రనిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ నోటిఫై చేసింది. ఈ విషయాన్ని ఎఫ్‌ఎస్‌ఎల్‌డైరెక్టర్ షికాగోయల్ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఎఫ్‌ఎస్‌ఎల్‌ను ‘గవర్నమెంట్ ఎగ్జామినర్ ఆఫ్ ఎలకా్ట్రనిక్ ఎవిడెన్స్’గా కేంద్రం గుర్తించిందని ఆమె వివరించారు.
డిజిటల్, ఎలకా్ట్రనిక్ సాక్ష్యాలకు సంబంధించి ఎఫ్‌ఎ్‌సఎల్ ఇచ్చే నివేదికలను ఇక నుంచి దేశవ్యాప్తంగా కోర్టులు ఆమోదయోగ్యమైనవిగా గుర్తిస్తాయన్నారు. తెలంగాణ ఎఫ్‌ఎ్‌సఎల్‌లోని డిజిటల్ ఫోరెన్సిక్ విభాగం దేశంలోని అత్యంత అధునాతనమైన వాటిల్లో ఒకటని షికా గోయల్ వివరించారు.
ఇవీ చదవండి:
రైల్వే టిక్కెట్ల వెనుక బిగ్ స్కాం.. మోసపోయిన లక్షల మంది..
జూన్ నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి