Share News

Old Pension Scheme: పాత పింఛన్‌ పథకాన్ని ఏడాదిలోగా పునరుద్ధరించాలి

ABN , Publish Date - Sep 02 , 2025 | 04:14 AM

కొత్త పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తే సీఎం రేవంత్‌రెడ్డి చరిత్రలో నిలుస్తారని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ మారం జగదీశ్వర్‌...

Old Pension Scheme: పాత పింఛన్‌ పథకాన్ని ఏడాదిలోగా  పునరుద్ధరించాలి

  • ఉద్యోగుల జేఏసీ తీర్మానం

కొత్త పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తే సీఎం రేవంత్‌రెడ్డి చరిత్రలో నిలుస్తారని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ మారం జగదీశ్వర్‌, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఏడాది లోపు సీపీఎ్‌సను రద్దు చేసి పాత పెన్షన్‌ను పునరుద్ధరించాలని ఏకవాక్య తీర్మానం చేశామన్నారు. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం ‘పాత పింఛన్‌ సాధన పోరాట సభ’ను హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళాభవన్‌లో నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సీపీఎస్‌ ఉద్యోగులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మారం జగదీశ్వర్‌ మాట్లాడుతూ.. సీపీఎస్‌ అమల్లోకి వచ్చిన 2004 సెప్టెంబరు 1 నుంచి ఏ ఉద్యోగి కుటుంబానికి భద్రత, భరోసా లేదన్నారు. సీపీఎ్‌సను రద్దు చేసి ప్రతి నెలా షేర్‌ మార్కెట్‌కు వెళ్తున్న రూ.450 కోట్ల ఉద్యోగుల సొమ్మును ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం వినియోగించాలని కోరారు. ఏలూరి శ్రీనివాస్‌ రావు మాట్లాడుతూ.. కాంగ్రె్‌సపాలిత నాలుగు రాష్ట్రాల్లో పాత పింఛన్‌ విధానాన్ని పునరుద్ధరించారని, తెలంగాణలోనూ ఈ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. సీపీఎస్‌ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు స్థిత ప్రజ్ఞ మాట్లాడుతూ..సీపీఎస్‌ విధానం రద్దు చేసి పాత పింఛన్‌ విధానాన్ని తక్షణమే చేపట్టాలని డిమాండ్‌ చేశారు. పాత పింఛన్‌ విధానాన్ని సాధించే వరకు విశ్రమించేది లేదన్నారు. యూటీఎఫ్‌ అధ్యక్షుడు చావ రవి మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయుల ఐక్య పోరాటం ద్వారా ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ శ్రీపాల్‌ రెడ్డి, ఎస్టీయూ అధ్యక్షుడు సదానంద గౌడ్‌, టీపీటీఎఫ్‌ నేత అనిల్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కేసీఆర్, హరీష్ రావు మధ్యంతర పిటిషన్లపై కొన్ని ఘడియల్లో విచారణ

తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై కమిటీ ఏర్పాటు

For More TG News And Telugu News

Updated Date - Sep 02 , 2025 | 04:14 AM