Disabled Corporation: దివ్యాంగజన్ పథకం అమలుకు కార్యాచరణ!
ABN , Publish Date - Jul 26 , 2025 | 05:13 AM
తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్‌కు నిధులు కేటాయించి, గ్రాంట్ ఇన్ ఎయిడ్‌ను పునరుద్ధరించాలని ఆ సంస్థ ఛైర్మన్ ముత్తినేని వీరయ్య జాతీయ దివ్యాంగజన్ ఆర్థికాభివృద్ధి
తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య వెల్లడి
తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్‌కు నిధులు కేటాయించి, గ్రాంట్ ఇన్ ఎయిడ్‌ను పునరుద్ధరించాలని ఆ సంస్థ ఛైర్మన్ ముత్తినేని వీరయ్య జాతీయ దివ్యాంగజన్ ఆర్థికాభివృద్ధి కార్పొరేషన్(ఎన్‌డీఎ్‌ఫడీసీ) అధికారులకు విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీలోని ఎన్‌డీఎ్‌ఫడీసీ కార్యాలయంలో ఆ సంస్థ ఛైర్మన్ అనిల్ కుమార్‌తో ఆయన సమావేశమై చర్చలు జరిపారు. అధికారులు సానుకూలంగా స్పందించారని సమావేశం తర్వాత వీరయ్య తెలిపారు.
రాష్ట్రంలో దివ్యాంగజన్ స్వావలంబన్ పథకం అమలుకు త్వరలోనే కార్యాచరణ ప్రారంభిస్తామని అధికారులు హామీ ఇచ్చారని వీరయ్య చెప్పారు. నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ పథకం అమలుకు సహకరించలేదని అధికారులు చెప్పారని ఆయన తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నా జోలికొస్తే అడ్డంగా నరికేస్తా..
బాలికపై అత్యాచారం.. గర్భం దాల్చిందని బతికుండగానే..
For Telangana News And Telugu News