Share News

Crime News: జీవిత ఖైదు విధించిన కోర్టు.. శిక్షకు ముందు మరో హత్యాచారం..

ABN , Publish Date - Oct 14 , 2025 | 06:53 PM

మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. జీవిత ఖైదు పడిన ఓ వ్యక్తి కిరాతకంగా వ్యవహరించాడు. ఎలాగూ జైలు శిక్ష అనుభవించబోతున్నాననే కారణంతో మరో దారుణ నేరానికి పాల్పడ్డాడు. ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడి, ఆమెను కిరాతకంగా చంపేశాడు.

Crime News: జీవిత ఖైదు విధించిన కోర్టు.. శిక్షకు ముందు మరో హత్యాచారం..
Telangana crime news

మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. జీవిత ఖైదు పడిన ఓ వ్యక్తి కిరాతకంగా వ్యవహరించాడు. ఎలాగూ జైలు శిక్ష అనుభవించబోతున్నాననే కారణంతో మరో దారుణ నేరానికి పాల్పడ్డాడు. ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడి, ఆమెను కిరాతకంగా చంపేశాడు. మెదక్ జిల్లాలో ఈ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు వెంటనే నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు (man kills woman before jail).


సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం అంబుజిగూడ తండా కు పాత నేరస్థుడ మెగావత్ ఫకీర నాయక్‌పై గతంలో ఏడు కేసులు ఉన్నాయి. ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నాడు. అతడి కేసులను విచారించిన న్యాయస్థానం అతడికి జీవితఖైదు విధించింది. ఎలాగూ శిక్ష పడబోతోందని ఫకీర్ నాయక్ మరో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కొల్చారం మండలం అప్పాజీపల్లిలో నాలుగు రోజుల క్రితం కూలి పని కోసం ఓ మహిళను తీసుకెళ్లాడు (life sentence crime Telangana).


ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బండ రాయితో దాడి చేసి పరారయ్యాడు (serious crime). తీవ్ర గాయాలతో ఉన్న ఆమెను హైదరాబాద్ తరలిస్తుండగా మృతి చెందింది. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టుగా మెదక్ జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఎస్పీ శ్రీనివాసరావు కేసు వివరాలను వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మంత్రుల మధ్య విభేదాలు.. స్పందించిన మంత్రి ఉత్తమ్

సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.. బీఆర్ఎస్‌పై మంత్రి కొండా సురేఖ ఫైర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 14 , 2025 | 06:53 PM