Share News

Gallantry Medal: కానిస్టేబుల్‌ రాజు నాయక్‌కు శౌర్య పతకం

ABN , Publish Date - Aug 15 , 2025 | 04:16 AM

తెలంగాణకు చెందిన కానిస్టేబుల్‌ కాట్రావత్‌ రాజు నాయక్‌ శౌర్య పతకానికి ఎంపికయ్యారు. ఆయనతోపాటు ఏఎస్సై మ్యాతరి సిద్ధయ్య, కానిస్టేబుల్‌ హుస్సేన్‌ నిడమనూరికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు లభించాయి.

Gallantry Medal: కానిస్టేబుల్‌ రాజు నాయక్‌కు శౌర్య పతకం

  • ఏఎస్సై సిద్ధయ్య, కానిస్టేబుల్‌ హుస్సేన్‌కు రాష్ట్రపతి పోలీస్‌ విశిష్ట సేవా పతకం

  • 21 మంది తెలంగాణ పోలీసులకు పతకాలు

  • స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పోలీస్‌ పతకాలను ప్రకటించిన కేంద్రం

  • దక్షిణ మధ్య రైల్వేలో ఇద్దరికి పతకాలు

  • సీఐఎ్‌సఎఫ్‌ డిప్యూటీ కమాండెంట్‌కు రాష్ట్రపతి మెరిటోరియస్‌ అవార్డు

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణకు చెందిన కానిస్టేబుల్‌ కాట్రావత్‌ రాజు నాయక్‌ శౌర్య పతకానికి ఎంపికయ్యారు. ఆయనతోపాటు ఏఎస్సై మ్యాతరి సిద్ధయ్య, కానిస్టేబుల్‌ హుస్సేన్‌ నిడమనూరికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు లభించాయి. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పోలీసు, అగ్నిమాపక శాఖ, హోంగార్డు, సివిల్‌ డిఫెన్స్‌, కరెక్షనల్‌ సర్వీసె్‌స(జైళ్లశాఖ)కు చెందిన 1,090 మంది అధికారులకు శౌర్య/సేవా పోలీస్‌ పతకాలను ప్రకటించింది. గురువారం కేంద్ర హోంశాఖ ఈ మేరకు జాబితాను విడుదల చేసింది. 1,090 మందిలో.. 226 మందికి శౌర్య పతకాలు(జీఎం), 89 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు(పీఎ్‌సఎం), 635 మందికి ప్రతిభాపూర్వక సేవా పతకాల(ఎంఎ్‌సఎం)ను ప్రకటించింది. ఇందులో తెలంగాణకు చెందిన ఒకరికి శౌర్య పతకం, ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 21 మంది పోలీసులకు, నలుగురు అగ్నిమాపక శాఖ అధికారులు, ఇద్దరు హోంగార్డులు, జైళ్ల శాఖ నుంచి ఒకరికి ప్రతిభాపూర్వక సేవా పతకాలు లభించాయి. ప్రాణాలు, ఆస్తులను కాపాడటంలో, నేరాలను నిరోధించడంలో లేదా నేరస్థులను అరెస్టు చేయడానికి విధి నిర్వహణలో ప్రదర్శించిన తెగువ ఆధారంగా రాష్ట్రపతి శౌర్య పతకం(పీఎంజీ), శౌర్య పతకం(జీఎం) లభిస్తాయి. విధి నిర్వహణలో అందించిన విశిష్ట సేవకు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం(పీఎ్‌సఎం), విలువైన సేవకు ప్రతిభాపూర్వక సేవా పతకం(ఎంఎ్‌సఎం) అందజేస్తారు.


వీరికే పతకాలు

కాట్రావత్‌ రాజు నాయక్‌కు శౌర్య పతకం, మ్యాతరి సిద్ధయ్య, హుస్సేన్‌ నిడమనూరికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు లభించాయి. నల్లమల రవి(డీసీపీ), తొగరు కరుణాకర్‌(డీసీపీ/అసెంబ్లీ చీఫ్‌ మార్షల్‌), జె.షేక్‌ షమీర్‌(డీసీపీ), పుట్ట దేవీదా్‌స(కమాండెంట్‌/సచివాలయం చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌), ఆంజనేయరాజు(సీఐఎ్‌సఐఫ్‌ డిప్యూటీ కమాండెంట్‌, రామగుండం), మేకల అబ్రహం(ఏఆర్‌ఎస్సై), శిందే ప్రకాశ్‌(ఏఆర్‌ఎస్సై), ముడావత్‌ దశరథ్‌(ఏఆర్‌ఎస్సై), రామ్‌దులార్‌ సింగ్‌ (ఏఆర్‌ఎస్సై), మహమ్మద్‌ మొయిజుద్దీన్‌(ఏఎస్సై), రాజేశ్వరి శ్రీనివా్‌స(ఏఎస్సై), రుద్ర కృష్ణకుమార్‌ (ఏఎస్సై), ఖాన్‌ వహీదుల్లా మహమ్మద్‌(లీడింగ్‌ ఫైర్‌మన్‌- జగిత్యాల జిల్లా), తల్లా నాగేశ్‌(లీడింగ్‌ ఫైర్‌ మన్‌- ములుగు జిల్లా), సాధిక్‌ మహమ్మద్‌(లీడింగ్‌ ఫైర్‌మన్‌- భద్రాద్రి జిల్లా), బీరెడ్డి గోపాల్‌ రెడ్డి(లీడింగ్‌ ఫైర్‌మన్‌- కరీంనగర్‌ జల్లా), రాజు జొన్నాడ(హోంగార్డ్‌), సంగం పిసరి(హోంగార్డ్‌)కు ప్రతిభాపూర్వక సేవా పతకాలు లభించాయి.


రైల్వే రక్షణ దళానికి..

దక్షిణ మధ్య రైల్వే రక్షణ దళాని(ఆర్పీఎ్‌ఫ)కి చెందిన ఇద్దరు పోలీసు అధికారులు రాష్ట్రపతి పోలీసు పతకాలకు ఎంపికయ్యారు. వీరిలో గుంటూరు డివిజనల్‌ సెక్యూరిటీ కమిషనర్‌ గొల్లమూడి మధుసూదనరావు, రేణిగుంట అసిస్టెంట్‌ సెక్యూరిటీ కమిషనర్‌ కె.రాజగోపాల రెడ్డి ఉన్నారు. వీరిద్దరినీ దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ సంజయ్‌కుమార్‌ శ్రీవాస్తవ అభినందించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పోలీసుల విద్యార్హతపై.. డీజీపీ కీలక వ్యాఖ్యలు

సీఎంపై ప్రశంసలు.. ఎమ్మెల్యేను బహిష్కరించిన పార్టీ

Updated Date - Aug 15 , 2025 | 04:16 AM