TPCC Restructuring: టీపీసీసీకి నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు
ABN , Publish Date - May 26 , 2025 | 03:12 AM
సుప్రీం కోర్టు పేర్కొనటంలో, పందేలు లేకుండా వినోదం కోసం పేకాట ఆడటం నైతిక ఉల్లంఘన కింద రాదు. కర్ణాటక హౌసింగ్ సొసైటీ బోర్డు డైరెక్టర్ కేసులో ఈ స్పష్టీకరణ చేసింది.
త్వరలో పీసీసీ కొత్త కార్యవర్గం.. వారంలో మంత్రివర్గ విస్తరణ!
క్యాబినెట్‌లో కొత్తగా ఐదుగురికి అవకాశం
ప్రస్తుత మంత్రుల్లో ఒకరిద్దరికి స్థానచలనం
కేసీ వేణుగోపాల్‌తో గంటకు పైగా సీఎం, పీసీసీ చీఫ్ భేటీ
నేడు రాహుల్, రేపు ఖర్గేతో రేవంత్, మహేశ్‌గౌడ్ సమావేశం
బీఆర్‌ఎ్‌సలో పంచాయితీపై ఆరా.. కవిత లేఖపైనా చర్చ
న్యూఢిల్లీ, మే 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ)కి నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించనున్నట్లు తెలిసింది. వీరి నియామకం విషయంలో సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యతనిస్తున్నట్లు సమాచారం. ఆదివారం సాయంత్రం ఢిల్లీ లోథి రోడ్డులోని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత వ్యవహారాలు) కేసీ వేణుగోపాల్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా మంత్రి వర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై గంటకు పైగా చర్చించారు. ముందు నుంచి పీసీసీలో బాహుబలి(జంబో) కమిటీకి ప్రాధాన్యమిస్తారనే ప్రచారం జరిగినా.. తాజా భేటీ సందర్భంగా 10-15% కోత విధించాలని కేసీ వేణుగోపాల్ సూచించినట్లు తెలిసింది. నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్ల విషయంలోనూ సామాజిక న్యాయాన్ని పాటించాలని ఆయన సూచించారని సమాచారం. ఇక తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కూడా దాదాపుగా ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. వారంరోజుల్లో మంత్రివర్గ విస్తరణతోపాటు.. పీసీసీ పదవుల భర్తీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలిసింది. కేసీ వేణుగోపాల్‌తో భేటీ సందర్భంగా కొత్తగా మంత్రివర్గంలో ఐదుగురికి చోటు కల్పించడంపై చర్చించినట్లు వర్గాలు చెబుతున్నాయి. కుల గణన, బీసీ రిజర్వేషన్లకు పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ పార్టీ, అదేబాటలో మంత్రివర్గ విస్తరణలోనూ సామాజిక న్యాయాన్ని పాటించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఐదు మంత్రి పదవుల్లో రెడ్డి సామాజిక వర్గానికి ఒకటి ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించగా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అవకాశం కల్పించాలని యోచిస్తున్నట్టు సమాచారం. అయితే.. ఓ సామాజిక వర్గానికి సంబంధించిన పదవిపై మాత్రం సందిగ్ధత నెలకొన్నట్టు ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఓసీ కేటగిరీలో రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇద్దరికి అవకాశం కల్పించే అంశంపైనా చర్చించినట్లు తెలిసింది. కాగా, తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన చర్చగా నిలిచిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత లేఖపైనా ఈ భేటీలో చర్చ జరిగినట్లు తెలిసింది. కవిత లేఖపై కేసీఆర్ ఎలా స్పందిస్తున్నారు? తెలంగాణ రాజకీయాల్లో కవిత ప్రభావం ఎంత? కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చే అంశాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణాలపై చర్చించినట్లు సమాచారం. కవిత లేఖ రాయాల్సిన అవసరం ఏముంది? ఇందులో బీజేపీ ప్రమేయం ఏమైనా ఉందా? అని చర్చ జరిగినట్లు కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలిసింది. బీఆర్‌ఎస్ పార్టీలో ఆమె చెప్పే దయ్యాలు ఎవరు? భవిష్యత్తులో బీఆర్‌ఎస్ పరిస్థితి ఏమిటి? అనేదానిపై కేసీ ఆరా తీసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
నేడు, రేపు బిజీబిజీ
కేసీ వేణుగోపాల్ విదేశీ పర్యటనను ముగించుకుని ఆదివారమే ఢిల్లీకి చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం ఆదివారమే హైదరాబాద్‌కు చేరుకోవాల్సి ఉంది. చివరి నిమిషంలో కేసీతో రేవంత్, మహేశ్ కుమార్ భేటీ అయ్యారు. అయితే, మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గంపై ఇప్పటికే తుది జాబితాను ఖరారు చేయగా, దాన్ని రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఆమోదించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి, మహేశ్ కుమార్ భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరిద్దరూ మంగళవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసే అవకాశం ఉంది. ఈ క్రమంలో కేసీ వేణుగోపాల్ సూచనతో ముఖ్యమంత్రి హైదరాబాద్ పర్యటనను వాయిదా వేసుకున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి
Minister Satyakumar: 2047 నాటికి ప్రపంచంలో రెండో స్థానానికి భారత్ ఎదగడం ఖాయం
Transgenders: డబ్బులు అడగొద్దన్నందుకు.. నడిరోడ్డులో పోలీస్‌పై ట్రాన్స్‌జెండర్ల దారుణం..
Indian Delgation in Japan: ఉగ్రవాదం రాబిడ్ డాగ్, దాని నీచమైన నిర్వాహకుడు పాక్.. నిప్పులు చెరిగిన అభిషేక్
India slams Pak: ప్రసంగాలు ఆపండి.. UN లో పాక్‌పై విరుచుకుపడిన భారత్..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి