Telangana BJP MPs: తెలంగాణ బీజేపీ ఎంపీల సాయం.. 'ఎంపీ ల్యాడ్స్' నిధులు ఒక్కొక్కరు రూ. 10 లక్షల చొప్పున కేటాయింపు
ABN , Publish Date - Aug 31 , 2025 | 03:46 PM
తెలంగాణ బీజేపీ ఎంపీలు సొంత రాష్ట్రానికి అండగా నిలిచారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద ముంపుతో సతమతమవుతున్న ప్రజలకు తమ వంతు తోడ్పాటునందించారు. రాష్ట్రంలోని బీజేపీకి చెందిన ఆరుగురు ఎంపీలు, ఇద్దరు కేంద్రమంత్రులు తమ ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి ఒక్కొక్కరు రూ. 10 లక్షల చొప్పున కేటాయించారు.
హైదరాబాద్, ఆగస్టు 31: తెలంగాణ బీజేపీ ఎంపీలు సొంత రాష్ట్రానికి అండగా నిలిచారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద ముంపుతో సతమతమవుతున్న ప్రజలకు తమ వంతు తోడ్పాటునందించారు. రాష్ట్రంలోని బీజేపీకి చెందిన ఆరుగురు ఎంపీలు, ఇద్దరు కేంద్రమంత్రులు తమ ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి ఒక్కొక్కరు రూ. 10 లక్షల చొప్పున కేటాయించారు. ప్రజల కష్టసుఖాల్లో భరోసాగా బిజెపి ఎంపీలు నిలబడ్డారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్ రాంచదర్ రావు అన్నారు. తెలంగాణలో వరద నష్టం రిలీఫ్ చర్యల్లో భాగంగా బిజెపి ఎంపీల ఉదార సాయం ఉపయోగపడుతుందని చెప్పారు.
ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి తక్షణ సహాయం అందించినందుకు రాంచందర్ రావు.. తెలంగాణ బీజేపీ ఎంపీలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల కష్టాల్లో తోడుగా ఉండటం మా కర్తవ్యం అని ఆయన అన్నారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజల సమస్యలపై నిర్లక్ష్యం చూపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిన సందర్భంలో, బిజెపి ఎంపీలు తక్షణమే ముందుకు వచ్చి సహాయక చర్యల కోసం నిధులను కేటాయించడం గమనార్హమని రాంచందర్ రావు చెప్పుకొచ్చారు.
ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడల్లా BJP ముందుండి తోడ్పడుతుందని రాంచందర్ రావు పేర్కొన్నారు. 'ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రజా హితం కోసం పనిచేస్తుంది. ప్రజల పక్షాన నిలబడేది బిజెపి మాత్రమే అన్నది మరోసారి రుజువైంది. అని రాంచందర్ రావు అన్నారు. ప్రజల కష్టాల్లో తోడుగా ఉండటం, సహాయక చర్యల్లో పాల్గొనడం భారతీయ జనతా పార్టీ బాధ్యత అని రాంచందర్ రావు చెప్పారు. తెలంగాణ ప్రజల భవిష్యత్తు కోసం బీజేపీ ఎల్లప్పుడూ ముందుంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కలెక్టరేట్ నిర్మాణంపై డిప్యూటీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు
14, 15 తేదీల్లో తిరుపతిలో మహిళా పార్లమెంటేరియన్ల సమావేశం
For More AP News And Telugu News