Speaker at National Meet: ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణ శాసనసభ
ABN , Publish Date - Aug 26 , 2025 | 03:50 AM
ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణ శాసనసభను నిర్వహిస్తున్నామని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ చెప్పారు. ...
విపక్షాలకూ స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం..
అఖిల భారత స్పీకర్ల సదస్సులో గడ్డం ప్రసాద్
న్యూఢిల్లీ/వికారాబాద్, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణ శాసనసభను నిర్వహిస్తున్నామని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ చెప్పారు. అధికార పక్షంతోపాటు ప్రతిపక్షాలకు సైతం స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం కల్పిస్తున్నామన్నారు. సోమవారం ఢిల్లీలో అఖిల భారత స్పీకర్ల సదస్సులో ఆయన ప్రసంగించారు. తొలి శాసన సభాపతిగా విఠల్‌బాయి పటేల్ వారసత్వాన్ని, విలువలను కొనసాగించాల్సిన అవసరముందని చెప్పారు. ‘దేశ లేజిస్లేటివ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన పేరు.. విఠల్‌బాయి పటేల్‌దే.. ఆయన న్యాయవాద వృత్తిలో, భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పోషించిన పాత్ర మరువలేనిది. 1925లో బ్రిటిష్ వలస పాలనలో విఠల్ బాయి సెంట్రల్ లేజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికవడం సాధారణ విషయం కాదు. ఆయన స్పీకర్‌గా ఉన్నప్పుడే 1929లో భగత్‌సింగ్, భటెకేశ్వర్ దత్ వలస పాలనను వ్యతిరేకిస్తూ సెంట్రల్ అసెంబ్లీలో బాంబులు విసిరారు. అప్పుడు కూడా ఆందోళన చెందకుండా ఆయన సమయస్ఫూర్తితో వ్యవహరించారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకొనే తెలంగాణ శాసనసభను నడుపుతున్నాం’ అని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ బండా ప్రకాశ్ కూడా పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా రైతులకు హాని జరగనీయం.. అమెరికా టారిఫ్‌లపై మోదీ
ట్రంప్ టారిఫ్‌లపై పీఎంవో కీలక సమావేశం
For More National News