Share News

Kishan Reddy: 11 ఏళ్లలో 5 రెట్లు పెరిగిన సాగు రుణాలు

ABN , Publish Date - Jun 24 , 2025 | 04:35 AM

తెలంగాణలో 2013-14లో వ్యవసాయ రుణాల మొత్తం రూ.27,676 కోట్లు కాగా, ప్రధాని మోదీ నాయకత్వంలో అది 2024-25 నాటికి రూ.1,37,346 కోట్లకు పెరిగిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు.

Kishan Reddy: 11 ఏళ్లలో 5 రెట్లు పెరిగిన సాగు రుణాలు

  • 27,676 కోట్ల నుంచి 1,37,346 కోట్లకు పెరిగిన లోన్లు

  • 2 లక్షల మాఫీలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం.. ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో 2013-14లో వ్యవసాయ రుణాల మొత్తం రూ.27,676 కోట్లు కాగా, ప్రధాని మోదీ నాయకత్వంలో అది 2024-25 నాటికి రూ.1,37,346 కోట్లకు పెరిగిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. 11 ఏళ్లలో వ్యవసాయ రుణాలు 5 రెట్లు పెరిగాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తుందనటానికి ఈ లెక్కలు అద్దం పడుతున్నాయని తెలిపారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సోమవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎ్‌సఎల్‌బీసీ) సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రకటించిన రూ.2 లక్షల రుణమాఫీ ఇప్పటికీ పూర్తిగా అమలుకాలేదని అన్నారు. ఉదాహరణకు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో సుమారు 15 వేల మంది అర్హులైన రైతులు ఉన్నప్పటికీ, వారి ఖాతాల్లో నిధులు జమచేయలేదని తెలిపారు. రూ.లక్షలోపు వ్యవసాయ రుణాలు తీసుకున్న లక్షలాది మందికి ఇప్పటికీ రుణమాఫీ అమలు కాలేదని చెప్పారు.


ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఆయా బ్యాంకుల నుండి స్పష్టమైన సమాచారం ేసకరించి, రైతులందరికీ రుణమాఫీ చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటూ రుణమాఫీ అమలు అంశాన్ని వేగవంతం చేయాలని బ్యాంకర్లకు దిశానిర్దేశం చేశారు. ప్రధాని మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో బ్యాంకింగ్‌ ేసవల విస్తరణ వేగంగా జరిగిందని కిషన్‌రెడ్డి అన్నారు. 2014లో రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకుల శాఖల సంఖ్య 6 వేలు ఉండగా, దాదాపు 600 కొత్త శాఖలు పెరిగినట్లు తెలిపారు. కేంద్రం అమలుచేస్తున్న పథకాలు, క్రాఫ్ట్‌ లోన్లు, టర్మ్‌ లోన్లు, వ్యవసాయ రుణాలు, డెయిరీ, పౌలీ్ట్ర రంగాలకు సంబంధించిన లోన్లతోపాటు విశ్వకర్మ యోజన, ముద్రా యోజన, చిరు వ్యాపారుల రుణ సౌకర్యాల వంటి పథకాలను ప్రజలకు మరింత చేరువగా తీసుకెళ్లాలని బ్యాంకర్లకు కిషన్‌రెడ్డి సూచించారు.

Updated Date - Jun 24 , 2025 | 04:35 AM