Mahbubnagar: ప్రేమ జంట ఆత్మహత్య..
ABN , Publish Date - May 05 , 2025 | 05:02 AM
మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నరేవల్లి గ్రామంలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది.
రాజాపూర్, మే 4(ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నరేవల్లి గ్రామంలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరూ మైనర్లేనని ఎస్‌ఐ శివానందం తెలిపారు. చిన్న రేవల్లికి చెందిన యువకుడు(17), అతడి కంటే 6 నెలలు పెద్దదైన యువతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.
పెళ్లి వయసు వచ్చి, ఆర్థికంగా స్థిరపడిన తరువాత పెళ్లి చేస్తామని కుటుంబసభ్యులు, గ్రామస్థులు వారికి నచ్చచెప్పారు. అయితే ఆదివారం యువతి ఇంట్లో చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న యువకుడు మొదంపల్లి గ్రామ శివారులోని పశువుల కొట్టంలో ఉరేసుకున్నాడు.