Share News

Sircilla: లిఫ్ట్‌ వచ్చింది అనుకుని అడుగు వేసి జారిపడి... సిరిసిల్ల బెటాలియన్‌ కమాండెంట్‌ మృతి

ABN , Publish Date - Mar 12 , 2025 | 04:57 AM

ఓ అపార్ట్‌మెంట్‌ లిఫ్ట్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య సిరిసిల్ల 17వ బెటాలియన్‌ కమాండెంట్‌ తోట గంగారాం(59) ప్రాణం తీసింది.

Sircilla: లిఫ్ట్‌ వచ్చింది అనుకుని అడుగు వేసి జారిపడి... సిరిసిల్ల బెటాలియన్‌ కమాండెంట్‌ మృతి

సిరిసిల్ల, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): ఓ అపార్ట్‌మెంట్‌ లిఫ్ట్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య సిరిసిల్ల 17వ బెటాలియన్‌ కమాండెంట్‌ తోట గంగారాం(59) ప్రాణం తీసింది. సిరిసిల్లలోని వెంకట్రావునగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉండే తన స్నేహితుడు, సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌ రెడ్డి నివాసానికి గంగారాం సోమవారం రాత్రి వెళ్లారు. ఆయనతో కాసేపు మాట్లాడిన తర్వాత రాత్రి 10.30 గంటలప్పుడు మూడో అంతస్థులోని ఆ ఇంటి నుంచి బయటకు వచ్చి కిందకి వెళ్లేందుకు లిఫ్ట్‌ స్విచ్‌ నొక్కారు.


సేఫ్టీ డోర్‌ తెరుచుకోవడంతో లిఫ్ట్‌లోకి వెళ్లేందుకు ఆయన ముందుకు అడుగు వేశారు. కానీ లిఫ్ట్‌ రాకపోవడంతో గంగారాం అక్కడి నుంచి గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న లిఫ్ట్‌ హౌస్‌ కంపార్ట్‌మెంట్‌పై పడి తీవ్రంగా గాయపడ్డారు. పోలీసు, అగ్నిమాపక సిబ్బంది కలిసి ఆయనను బయటకు తీసి ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయారు.

Updated Date - Mar 12 , 2025 | 04:57 AM