Share News

Telangana’s 42% BC Reservation: 42 శాతం రిజర్వేషన్లపై సుప్రీంలో రేపు విచారణ.. సిద్ధమైన ప్రభుత్వం

ABN , Publish Date - Oct 05 , 2025 | 09:32 PM

రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం తెలిపింది. దీనికి అన్ని పార్టీల నేతలు అంగీకారం తెలిపారు. ఆ తర్వాత బిల్లును గవర్నర్ ఆమోదం కోసం రాజ్ భవన్‌కు పంపారు.

Telangana’s 42% BC Reservation: 42 శాతం రిజర్వేషన్లపై సుప్రీంలో రేపు విచారణ.. సిద్ధమైన ప్రభుత్వం
Telangana’s 42% BC Reservation

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై భారత అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టులో రేపు(సోమవారం) విచారణ జరగనుంది. సుప్రీంకోర్టులో తమ వాదనలు బలంగా వినిపించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణ ప్రభుత్వం తరపున సింగ్వి, దవే వాదనలు వినిపించనున్నారు. ఇద్దరు న్యాయవాదులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇప్పటికే మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ ఢిల్లీ ప్రయాణం అయ్యారు.


కాగా, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం తెలిపింది. దీనికి అన్ని పార్టీల నేతలు అంగీకారం తెలిపారు. ఆ తర్వాత బిల్లును గవర్నర్ ఆమోదం కోసం రాజ్ భవన్‌కు పంపారు. ఈ బిల్లుకు గవర్నర్ ఇంకా ఆమోదం తెలపలేదు. ఇలాంటి సమయంలో తెలంగాణలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయబోతున్నారని సుప్రీంకోర్టులో వంగ గోపాల్ రెడ్డి పిటిషన్ వేశారు.


ఆ పిటిషన్‌పై రేపు విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు ఈ రిజర్వేషన్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం ఎలాగైనా తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేసి తీరాలన్న కసితో ఉంది. బలంగా తమ వాదనలు వినిపించి కేసు గెలిచే ప్రయత్నాలు చేస్తోంది.


ఇవి కూడా చదవండి

అదంతా ఫేక్.. వయో వృద్ధుల దర్శనంపై టీటీడీ క్లారిటీ

సింహం, సివంగి భీకర పోరు.. గెలుపు దేనిదంటే..

Updated Date - Oct 05 , 2025 | 09:35 PM