Important Advisory TTD Devotees: అదంతా ఫేక్.. వయో వృద్ధుల దర్శనంపై టీటీడీ క్లారిటీ
ABN , Publish Date - Oct 05 , 2025 | 08:51 PM
తిరుమల వెళ్లే భక్తులకు మందుబాబులు నరకం చూపిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని సైతం టీటీడీ ఖండించింది. అలిపిరి నుంచి రుయా ఆస్పత్రికి వెళ్లే మార్గంలో కొందరు ఆకతాయిలు పగిలిన గాజు సీసా ముక్కలను రోడ్డుపై విసిరేశారని తెలిపింది.
వయో వృద్ధుల దర్శనంపై గత కొంత కాలంగా జరుగుతున్న ప్రచారంపై తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించింది. అదంతా ఫేక్ అని తేల్చేసింది. వయో వృద్ధులైన భక్తుల దర్శనంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని మరోసారి విజ్ఞప్తి చేసింది. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న వార్తలన్నీ అవాస్తవమని స్పష్టం చేసింది. ఈ మేరకు టీటీడీ ఓ కీలక ప్రకటన విడుదల చేసింది.
అసలు వాస్తవం ఇది .. 'రోజూ 1000 మంది వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం టీటీడీ మూడు నెలల ముందుగానే ఆన్‌లైన్ కోటాను విడుదల చేస్తుంది. టికెట్ పొందిన వ్యక్తికి రూ.50 లడ్డూ ఉచితంగా ఇస్తుంది. తిరుమల నంబి ఆలయానికి ఆనుకొని ఉన్న సీనియర్ సిటిజన్/పీహెచ్‌సీ లైన్ ద్వారా రోజూ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి దర్శనానికి వారిని అనుమతిస్తారు' అని టీటీడీ వివరించింది. సరైన సమాచారం కోసం భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే సంప్రదించాలని అధికారులు కోరారు.
మరోవైపు తిరుమల వెళ్లే భక్తులకు మందుబాబులు నరకం చూపిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని సైతం టీటీడీ ఖండించింది. ‘అలిపిరి మెట్ల మార్గం దగ్గర మద్యం తాగి మందు బాబులు సీసాలు పగులగొట్టారంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవం. అలిపిరి నుంచి రుయా ఆస్పత్రికి వెళ్లే మార్గంలో కొందరు ఆకతాయిలు పగిలిన గాజు సీసా ముక్కలను రోడ్డుపై విసిరేశారు’ అని తెలిపింది.
ఇవి కూడా చదవండి
సింహం, సివంగి భీకర పోరు.. గెలుపు దేనిదంటే..
ఎలాన్ మస్క్ దెబ్బ.. నెట్‌ఫ్లిక్స్ మార్కెట్ విలువ పతనం