Share News

Netflix Share Slide: ఎలాన్ మస్క్ దెబ్బ.. నెట్‌ఫ్లిక్స్ మార్కెట్ విలువ పతనం

ABN , Publish Date - Oct 05 , 2025 | 07:11 PM

నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ క్యాన్సిల్ చేసుకోవాలంటూ ఎలాన్ మస్క్ ఇచ్చిన పిలుపు సంస్థ షేర విలువపై తీవ్ర ప్రభావం చూపింది. సంస్థ మార్కెట్ విలువలో ఏకంగా 15 బిలియన్ డాలర్ల మేర కోత పడింది.

Netflix Share Slide: ఎలాన్ మస్క్ దెబ్బ.. నెట్‌ఫ్లిక్స్ మార్కెట్ విలువ పతనం
Netflix boycott Elon Musk

ఇంటర్నెట్ డెస్క్: నెట్‌ఫ్లిక్స్‌ను బాయ్‌కాట్ చేయాలన్న ఎలాన్ మస్క్ పిలుపుతో సంస్థపై భారీ ప్రభావం పడింది. నెట్‌ఫ్లిక్స్ మార్కెట్ విలువ ఏకంగా 15 బిలియన్ డాలర్ల మేర తగ్గింది. కేవలం రోజున్నర వ్యవధిలో కంపెనీ షేర్ల ధర 4.3 శాతం మేర తగ్గిపోయింది. ఏప్రిల్ తరువాత ఈ స్థాయిలో షేరు ధర పడిపోవడం ఇదే తొలిసారి (Netflix boycott Elon Musk).

బాయ్‌కాట్ పిలుపు వెనుక..

పిల్లల భద్రత కోసం నెట్‌ఫ్లిక్స్‌ను బాయ్‌కాట్ చేయాలని మస్క్ పిలుపునిచ్చారు. నెట్‌ఫ్లిక్స్‌లో డెడ్ ఎండ్ పారానార్మల్ పార్క్ అనే షోపై ఆగ్రహంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. షోలో ఓ టీనేజర్‌ను ట్రాన్స్‌జెండర్‌గా చూపించడంపై మస్క్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను ఇప్పటికే తన సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేసుకున్నట్టు తెలిపారు. పిల్లల కోసం నెట్‌ఫ్లిక్స్‌‌ను బాయ్‌కాట్ చేయాలని అన్నారు. దీంతో, నెట్టింట క్యాన్సిల్ నెట్‌‌ఫ్లిక్స్ ట్రెండ్ మొదలైంది. జనాలు తమ సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేసుకున్నామంటూ స్క్రీన్ షాట్స్‌ను పోస్టు చేశారు. దీంతో, స్వల్ప వ్యవధిలోనే సంస్థ షేరు విలువ ఏకంగా 2 శాతం మేర పతనమైంది.


వాస్తవానికి ఈ షో 2023లోనే నిలిచిపోయింది. అయితే, అందులోని కొన్ని క్లిప్స్ ఇటీవల మళ్లీ వైరల్ అయ్యాయి. ఇలాంటి షోలకు ట్రాన్స్‌జెండర్ వోక్ ఎంజెడానే కారణమని జనాలు దుమ్మెత్తిస్తారు. మస్క్‌కు కూడా ఈ పోస్టులకు ప్రాధాన్యం ఇచ్చారు. మరోవైపు, ఈ షో రూపకర్త హామిష్ స్టీల్‌పై జనాల దృష్టి మళ్లింది. ఇటీవల హత్యకు గురైన చార్లీ కర్క్‌ ఓ నాజీ అంటూ ఆయన పేర్కొనడంపై జనాలు మండిపడ్డారు. ట్రాన్స్‌జెండర్ అయిన హామిష్ తమ వామపక్ష, వోక్ ఎజెండాను ముందుకు తోస్తున్నారని అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఈ క్రమంలో జనాగ్రహం నెట్‌ఫ్లిక్స్‌పై మళ్లింది. అయితే, ఈ వివాదంపై నెట్‌ఫ్లిక్స్ ఇప్పటివరకూ స్పందించలేదు. అయితే, గతంలోనూ సంస్థ ఇలాంటి కాంట్రవర్సీలను ఎదుర్కొంది.


ఇవీ చదవండి:

లాభాల నుంచి నష్టాల్లోకి.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..

భారీగా పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 05 , 2025 | 07:16 PM