Group 1 Rankers Appointments: గ్రూప్1 పరీక్షల వ్యవహారం.. ప్రభుత్వానికి మరోసారి ఊరట
ABN , Publish Date - Oct 09 , 2025 | 11:24 AM
గ్రూప్1 పరీక్షలపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పుపై జోక్యానికి సుప్రీం నిరాకరించింది. గ్రూప్ 1 ర్యాంకర్ల నియామకాలపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును వేముల అనుష్ సుప్రీం కోర్టులో సవాలు చేశారు.
తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. గ్రూప్1 పరీక్షలపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పుపై జోక్యానికి సుప్రీం నిరాకరించింది. గ్రూప్ 1 ర్యాంకర్ల నియామకాలపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును వేముల అనుష్ సుప్రీం కోర్టులో సవాలు చేశారు. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరిపింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పుపై జోక్యానికి ధర్మాసనం నిరాకరించింది.
ఇంతకు ముందు కూడా..
గ్రూప్ -1 ర్యాంకర్ల నియామకాలపై తెలంగాణ హైకోర్టు తీర్పును కొంతమంది అభ్యర్థులు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈ నేపథ్యంలో జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. హైకోర్టు డివిజన్ బెంచ్ మధ్యంతర తీర్పు ఇచ్చినందున ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చే తుది ఉత్తర్వులకు అనుగుణంగా నియామకాలు ఉండాలని పేర్కొంది. వీలైనంత తొందరగా పిటిషన్లను విచారించి ఆదేశాలివ్వాలని స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి
మార్కెట్‌లో మధుర ఫలాలు.. కిలో రూ.100కి పైగానే
ఈ కారు డ్రైవర్ నిజంగా లక్కీ.. త్రుటిలో పెద్ద ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డాడో చూడండి..