shocking video: ఈ కారు డ్రైవర్ నిజంగా లక్కీ.. త్రుటిలో పెద్ద ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డాడో చూడండి..
ABN , Publish Date - Oct 09 , 2025 | 10:23 AM
అదృష్టం ఉంటే సముద్రం మధ్యలో పడినా ఎలాగోలా ఒడ్డుకు వచ్చేస్తామనేది సామెత. అదృష్టం బాగుంటే ఎంత పెద్ద ప్రమాదం నుంచైనా సునాయాసంగా బయటపడవచ్చు. ప్రాణాలు పోయే పరిస్థితి నుంచి తప్పించుకోవచ్చు.
అదృష్టం ఉంటే సముద్రం మధ్యలో పడినా ఎలాగోలా ఒడ్డుకు వచ్చేస్తామనేది సామెత. అదృష్టం బాగుంటే ఎంత పెద్ద ప్రమాదం నుంచైనా సునాయాసంగా బయటపడవచ్చు. ప్రాణాలు పోయే పరిస్థితి నుంచి తప్పించుకోవచ్చు. అలాంటి ఎన్నో వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా మన కళ్ల ముందుకు వచ్చాయి. తాజాగా మరో షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (unbelievable escape).
@iNikhilsaini అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ కొండ ప్రాంతంలోని ఘాట్ రోడ్డులో కొన్ని వాహనాలు ప్రయాణిస్తున్నాయి. ఆ మార్గంలో కార్లు చాలా నెమ్మదిగా వెళ్తున్నాయి. ఆ సమయంలో కొండ పై నుంచి ఒక పెద్ద బండరాయి హఠాత్తుగా కిందకు పడిపోయింది. అయితే అదృష్టవశాత్తూ అది కారు ముందు భాగానికి మాత్రమే తగిలింది. ఆ రాయి కొంచెం తగిలినందుకే ఆ కారు ముందు భాగం దెబ్బతింది (driver escapes death).
ఒకవేళ ఆ రాయి కారు మీద పడి ఉంటే కారుతో పాటు అందులోని ప్రయాణికులు కూడా నుజ్జయిపోయేవారు (near death experience). కిన్నౌర్‌లోని నాథ్పా పాయింట్ వద్ద జరిగిన ఆ ఘటన కారు డ్యాష్‌క్యామ్‌లో రికార్డు అయింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. కొన్ని వేల మంది ఈ వీడియోను వీక్షించి తమ స్పందనలు తెలియజేశారు. వర్షా కాలంలో ఘాట్ రోడ్లలో ప్రయాణం చాలా ప్రమాదకరం అని కొందరు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
ఈ కార్మికులు చాలా తెలివైన వాళ్లు.. బస్తాను పైకి ఎలా పంపుతున్నారో చూడండి..
ఈ ఫొటోలో రెండో కారు కూడా ఉంది.. ఎక్కడ.. 6 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..