Share News

Justice Vikram Nath: బాలలకు న్యాయం.. దీర్ఘకాల రక్షణలా ఉండాలి

ABN , Publish Date - Jul 07 , 2025 | 02:39 AM

వివిధ నేరాల్లో బాధితులుగా మారిన బాలలకు న్యాయమనేది కేవలం చట్టపరమైన చర్యలతో ఆగిపోకూడదని.. సామాజిక, మానసిక సాయమూ అందించేలా ఉండాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ చెప్పారు.

Justice Vikram Nath: బాలలకు న్యాయం.. దీర్ఘకాల రక్షణలా ఉండాలి

  • చట్టపరమైన చర్యలే కాదు..సామాజిక సాయమూ దక్కాలి

  • సుప్రీంకోర్టు న్యాయమూర్తి విక్రమ్‌నాఽథ్‌

  • బాలలు చీకటి గాయాలను మరిచేలా ఉపశమన చర్యలుండాలి: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సామ్‌ కోషి

హైదరాబాద్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి): వివిధ నేరాల్లో బాధితులుగా మారిన బాలలకు న్యాయమనేది కేవలం చట్టపరమైన చర్యలతో ఆగిపోకూడదని.. సామాజిక, మానసిక సాయమూ అందించేలా ఉండాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ చెప్పారు. బాలలకు దీర్ఘకాలిక రక్షణ అందించాలని సూచించారు. బాలల హక్కులు, రక్షణ అంశంపై హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలో రెండు రోజులు పాటు జరిగిన సదస్సు ముగింపు కార్యక్రమంలో జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ మాట్లాడారు. చిన్నారులపై లైంగిక వేధింపుల కేసులు చట్టపరమైన పోరాటం మాత్రమేకాదని, బాల్యంపై వారు నమ్మకాన్ని కోల్పోకుండా, సానుభూతితో దీర్ఘకాలిక రక్షణ కల్పించేలా న్యాయం ఉండాలని చెప్పారు. తెలంగాణ భరోసా మోడల్‌ను ఆయన అభినందించారు. ఇదీ వైద్య, చట్టపరమైన, మానసిక, సామాజిక సహాయాన్ని ఒకేచోట చేర్చిన ఏకీకృత ప్రగతిశీల చొరవగా అభివర్ణించారు. లైంగిక వేధింపులకు గురైన చిన్నారులకు ఆ చీకటి గాయాన్ని గుర్తు చేయకుండా మళ్లీ బాల్యంలోకి తీసుకువెళ్లడం అన్ని శాఖల మీదున్న ప్రధాన కర్తవ్యమని చెప్పారు.


ఇక బాలలపై లైంగిక వేధింపుల ఘటనలకు సంబంధించి స్వాంతన చర్యలు చేపట్టే సంస్థాగత వ్యవస్ధలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ న్యాయసేవల సంస్థ ఎగ్జ్జిక్యూటివ్‌ చైర్మన్‌, హైకోర్టు న్యాయమూర్తి సామ్‌కోషి పేర్కొన్నారు. బాధలో ఉన్న చిన్నారులకు స్నేహపూర్వక చేయూత అందించాలని.. బాధిత బాలలకు అండగా ఉండే సంస్ధల మధ్య మరింత సమన్వయం అవసరమని హైకోర్టు తాత్కాలిక చీఫ్‌ జస్టిస్‌ సుజోయ్‌పాల్‌ చెప్పారు. బాలల భద్రత సామూహిక, నైతిక బాధ్యత అని.. ప్రాసిక్యూషన్‌ విభాగం మరింత సున్నితత్వంతో స్పందించాలని అడ్వొకేట్‌ జనరల్‌ సుద ర్శన్‌రెడ్డి అన్నారు. పోక్సో కేసుల విచారణలు, పునరావాస విధానాలు, బాలల హక్కుల రక్షణలో వ్యవస్థాగత మార్పుల అవసరాన్ని స్పష్టం చేస్తున్నాయని యూనిసెఫ్‌ ప్రతినిధి కుట్టిజార్జి చెప్పారు. తెలంగాణలోని భరోసా కేంద్రాల విధానాన్ని ఇతర రాష్ట్రాలు కూడా అనుసరించాలన్నారు. సదస్సులో న్యాయమూర్తులు కె.లక్ష్మణ్‌, స్మిత్‌, డాక్టర్‌ సుధ, మహిళా భద్రతా విభాగం ఎస్పీ చేతన రులు పలు అంశాలపై మాట్లాడారు.


Also Read:

కేటీఆర్‌కు సామ రామ్మోహన్ రెడ్డి సవాల్..

మోదీ ప్రభుత్వం విద్వేషాలని రెచ్చగొడుతోంది.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్

వందేభారత్‌కు తృటిలో తప్పిన ప్రమాదం..

For More Telangana News And Telugu News

Updated Date - Jul 07 , 2025 | 02:39 AM