Komatireddy Slams KTR: కాళేశ్వరం అవినీతిపై కఠిన చర్యలు
ABN , Publish Date - Aug 01 , 2025 | 03:24 AM
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడిన వారిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి
ఫిరాయింపులపై కేటీఆర్ మాట్లాడటమా?: మంత్రి కోమటిరెడ్డి
నల్లగొండ, జూలై 31 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడిన వారిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. కక్షసాధింపు ధోరణితో కాకుండా వాస్తవాలు, నివేదిక ఆధారంగానే చర్యలు ఉంటాయని చెప్పారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో గురువారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ హయాంలో కేవలం కమీషన్లు, కాంట్రాక్టుల కోసమే కాళేశ్వరం కట్టారని దుయ్యబట్టారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. గతంలో కమీషన్ల కోసమే పనులు చేపట్టారు తప్ప, కీలకమైన విద్యారంగాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. పార్టీ ఫిరాయింపుల అంశంపై మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో వేరే పార్టీల నుంచి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇచ్చిన విషయం కేటీఆర్ గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ పర్యటన.. ప్రశాంతి రెడ్డి రియాక్షన్
జగన్ జైలుకు వెళ్తారా అంటే.. లోకేష్ ఏమన్నారంటే..
For More Telangana News And Telugu News