Share News

State Tax Revenue: రాష్ట్ర పన్ను రాబడి పెరిగింది..!

ABN , Publish Date - Jul 26 , 2025 | 04:50 AM

రాష్ట్ర ప్రభుత్వ పన్ను రాబడి పెరిగింది. జూన్‌లో ఈ ఆదాయం పెరిగినట్లు కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) తెలిపింది.

State Tax Revenue: రాష్ట్ర పన్ను రాబడి పెరిగింది..!

  • జూన్‌లో రూ.13,122 కోట్ల రాక

  • మే కంటే రూ.1,420 కోట్లు అదనం

  • గత నెలలో ఏకంగా 10,876 కోట్ల అప్పు

  • ఆదాయ, వ్యయాలపై కాగ్‌ నివేదిక

హైదరాబాద్‌, జూలై 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ పన్ను రాబడి పెరిగింది. జూన్‌లో ఈ ఆదాయం పెరిగినట్లు కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) తెలిపింది. గత నెలలో పన్ను రాబడి రూ.13,112 కోట్లు వచ్చినట్లు వెల్లడించింది. ఈ మేరకు జూన్‌ నెలలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ, వ్యయాలకు సంబంధించి కాగ్‌ శుక్రవారం నివేదికను విడుదల చేసింది. వస్తు సేవల పన్ను, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, అమ్మకం పన్ను, రాష్ట్ర ఎక్సైజ్‌ సుంకాలు, కేంద్ర పన్నుల్లో వాటా, ఇతర పన్నులు, సుంకాల ద్వారా గత ఏప్రిల్‌లో రూ.10,916 కోట్ల ఆదాయం వచ్చింది. మేలో రూ.11,692 కోట్లు రాగా.. జూన్‌లో రూ.13,112 కోట్లు వచ్చింది. అంటే.. రూ.1,420 కోట్లు అదనంగా వచ్చాయి. దీంతో జూన్‌ నాటికి జీఎస్టీ ద్వారా రూ.12,622 కోట్లు, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.3,712 కోట్లు, అమ్మకం పన్ను ద్వారా రూ.8,466 కోట్లు, ఎక్సైజ్‌ సుంకాల ద్వారా రూ.4,595 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటా కింద రూ.4,385 కోట్లు, ఇతర పన్నులు, సుంకాల ద్వారా రూ.1,940 కోట్ల రాబడులు సమకూరాయి.


రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నికర అప్పు రూ.20,266 కోట్లకు చేరింది. ఒక్క జూన్‌లోనే రూ.10,876 కోట్ల రుణాలు తీసుకుంది. ఆ నెలలో రైతు భరోసా పథకాన్ని అమలు చేయడం వల్ల ఎక్కువ అప్పు తీసుకోవాల్సి వచ్చింది. ఇలా అన్ని రకాల రాబడుల ద్వారా ప్రభుత్వానికి జూన్‌ నాటికి రూ.57,499 కోట్లు సమకూరాయి. ఇది అంచనా వేసిన రాబడి రూ.2,84,837 కోట్లలో 20.19 శాతం. కాగా, జూన్‌ నాటికి ప్రభుత్వం అన్ని రకాలుగా రూ.52,559 కోట్లను ఖర్చు చేసింది. ఇది అంచనా వ్యయం రూ.2,63,846 కోట్లలో 19.95 శాతం. మూలధన వ్యయం కింద అంచనా వేసిన రూ.36,504 కోట్లలో జూన్‌ నాటికి రూ.4,755 కోట్లను ఖర్చు చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

నా జోలికొస్తే అడ్డంగా నరికేస్తా..

బాలికపై అత్యాచారం.. గర్భం దాల్చిందని బతికుండగానే..

For Telangana News And Telugu News

Updated Date - Jul 26 , 2025 | 04:50 AM