Ponguleti: నేటి నుంచి మరో 25 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్
ABN , Publish Date - May 12 , 2025 | 05:00 AM
రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వేగవంతం చేసేందుకు రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రారంభించిన స్లాట్ బుకింగ్ విధానం సోమవారం(12వ తేదీ) నుంచి మరో 25 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలులోకి రానుంది.

వచ్చే నెలాఖరుకు రాష్ట్ర వ్యాప్తంగా అమలు
అధిక రద్దీ కార్యాలయాల్లో అదనపు సిబ్బంది నియామకం
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
హైదరాబాద్, మే11 (ఆంధ్రజ్యోతి): రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వేగవంతం చేసేందుకు రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రారంభించిన స్లాట్ బుకింగ్ విధానం సోమవారం(12వ తేదీ) నుంచి మరో 25 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలులోకి రానుంది. అలాగే, జూన్ నెలాఖరు కల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదివారం ఓ ప్రకటన చేశారు. స్లాట్ బుకింగ్ విధానాన్ని తొలుత 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రారంభించామని, దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. రద్దీ, పని ఒత్తిడి అధికంగా ఉన్న కార్యాలయాల్లో అదనపు సబ్ రిజిస్ట్రార్‌లను నియమిస్తున్నామని చెప్పారు.
కుత్బుల్లాపూర్‌లో ఇద్దరు అదనపు సబ్ రిజిస్ట్రార్లను నియమించామని తెలిపారు. ఉప్పల్, మహేశ్వరం, మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అదనపు సిబ్బందిని నియమించడం ద్వారా స్లాట్ బుకింగ్ అమలు చేయనున్నామని వివరించారు. స్లాట్ బుకింగ్ విధానాన్ని దృష్టిలో ఉంచుకుని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిని పునర్‌వ్యవస్ధీకరిస్తున్నామని, అధిక రద్దీ, తక్కువ రద్దీ ఉన్న కార్యాలయాలను గుర్తించి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లా చంపాపేట, సరూర్‌నగర్ పరిధిని విలీనం చేశామని, షాద్‌నగర్, ఫరూక్‌నగర్ కలిపామని, సిద్దిపేట, సిద్దిపేట రూరల్ సబ్ రిజిస్ట్రార్‌లను విలీనం చేశామని మంత్రి పొంగులేటి తెలిపారు.
ఇవి కూడా చదవండి
Drunk Driving Incident: మద్యం తాగుతూ ఫుల్ స్పీడ్‌తో రైడ్.. వీడియో వైరల్
Donald Trump: విదేశాల్లో నిర్మించిన చిత్రాలపై 100% సుంకం..ఆ జైలు తిరిగి ప్రారంభిస్తాం
Read Latest Telangana News And Telugu News