Sangareddy: పెచ్చులూడిన అంగన్‌వాడీ భవనం పైకప్పు
ABN , Publish Date - Jan 25 , 2025 | 05:38 AM
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండల పరిధిలోని వెంకటాపూర్‌లో శుక్రవారం అంగన్‌వాడీ కేంద్రం పైకప్పు పెచ్చులు ఊడి పడడంతో ఆరుగురు చిన్నారులు గాయపడ్డారు.

ఆరుగురు చిన్నారులకు గాయాలు
నారాయణఖేడ్, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండల పరిధిలోని వెంకటాపూర్‌లో శుక్రవారం అంగన్‌వాడీ కేంద్రం పైకప్పు పెచ్చులు ఊడి పడడంతో ఆరుగురు చిన్నారులు గాయపడ్డారు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. అంగన్‌వాడీ కేంద్రం ప్రారంభమైన కొద్దిసేపటికే పై పెచ్చులూడి చిన్నారులపై పడ్డాయి. దీంతో అభిలాశ్, మౌనిక, వనిత, అంకిత, హారిక, ప్రణయ్‌కుమార్‌లకు గాయాలయ్యాయి.
వారిని నారాయణఖేడ్ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఎమ్మెల్యే సంజీవరెడ్డి, కలెక్టర్ వల్లూరి క్రాంతి చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించారు. నారాయణఖేడ్ ఇన్‌చార్జి సీడీపీవో సుజాత, అంగన్‌వాడీ టీచర్ అంబికను కలెక్టర్ సస్పెండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Virender Sehwag: విడాకులు తీసుకోనున్న వీరేంద్ర సెహ్వాగ్..
Kaleshwaram Commission: నేటి కాళేశ్వరం విచారణ.. అత్యంత కీలకం