Share News

Srishti Fertility Center: పిల్లల్లేని దంపతులకు సోషల్‌ మీడియాతో ఎర

ABN , Publish Date - Jul 30 , 2025 | 04:06 AM

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సృష్టి ఫర్టిలిటీ సెంటర్‌ కేసులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. కొన్నేళ్ల క్రితం సృష్టి ఫర్టిలిటీ సెంటర్‌ పేరుతో ఓ కేంద్రాన్ని ప్రారంభించిన డాక్టర్‌ నమ్రత..

Srishti Fertility Center: పిల్లల్లేని దంపతులకు సోషల్‌ మీడియాతో ఎర

  • ఉచిత పరీక్షల పేరిట మాయ

  • సృష్టి ఫర్టిలిటీ సెంటర్‌ మోసం

హైదరాబాద్‌ సిటీ, జూలై 29 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సృష్టి ఫర్టిలిటీ సెంటర్‌ కేసులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. కొన్నేళ్ల క్రితం సృష్టి ఫర్టిలిటీ సెంటర్‌ పేరుతో ఓ కేంద్రాన్ని ప్రారంభించిన డాక్టర్‌ నమ్రత.. పిల్లలు లేని దంపతులే లక్ష్యంగా సోషల్‌ మీడియా ద్వారా తన కేంద్రానికి విస్తృత ప్రచారం చేసుకున్నారు. యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌, ఫేస్‌బుక్‌ ద్వారా రకరకాల వీడియోలు, పోస్టులు చేసేవారు. టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ, సరగసీ విధానాల ద్వారా తల్లిదండ్రులు కావాలనే కోరికను తన ఆస్పత్రిలో నెరవేర్చుకోవచ్చని ప్రచారం చేసేవారు.


అంతేకాక, తమ క్లినిక్‌లో ఉచిత పరీక్షలు అంటూ ఆకట్టుకునేవారు. డిజిటల్‌ ప్రచారంతో సృష్టి ఫర్టిలిటీ సెంటర్‌ పేరు మార్మోగేలా చేసి పిల్లలు లేని దంపతులు క్యూకట్టేలా చేసుకున్నారు. అనంతరం దంపతుల బలహీనతను ఆసరాగా చేసుకొని అక్రమ మార్గంలో చిన్నారులను కొనుగోలు చేసి వారికి అప్పగించినట్టు తెలుస్తోంది. ఈ తరహా కేసులను ఇప్పటికే మూడింటిని గుర్తించిన పోలీసులు ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట

హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 30 , 2025 | 04:06 AM