Share News

Telugu Film Chamber: సేవ్ ఫిలిం ఛాంబర్ బ్రింగ్ బ్యాక్ ద గ్లోరీ.. సినీ ప్రముఖుల కొవ్వొత్తుల ర్యాలీ

ABN , Publish Date - Oct 27 , 2025 | 08:00 PM

హైదరాబాద్‌లోని తెలుగు ఫిలిం ఛాంబర్‌ను చిత్ర పరిశ్రమకు సంబంధించి తప్ప, వేరే వాటికి ఉపయోగించకూడదని 'సేవ్ ఫిలిం ఛాంబర్ బ్రింగ్ బ్యాక్ ద గ్లోరీ' పేరుతో సోమవారం సినీ ప్రముఖుల కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

Telugu Film Chamber: సేవ్ ఫిలిం ఛాంబర్ బ్రింగ్ బ్యాక్ ద గ్లోరీ.. సినీ ప్రముఖుల కొవ్వొత్తుల ర్యాలీ
Telugu Film Chamber

హైదరాబాద్, అక్టోబర్ 27: హైదరాబాద్‌లోని తెలుగు ఫిలిం ఛాంబర్‌ను చిత్ర పరిశ్రమకు సంబంధించి తప్ప, వేరే వాటికి ఉపయోగించకూడదని 'సేవ్ ఫిలిం ఛాంబర్ బ్రింగ్ బ్యాక్ ద గ్లోరీ' పేరుతో సోమవారం సినీ ప్రముఖుల కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసనకు నటులు మురళీ మోహన్, సురేష్ బాబు, శివాజీ రాజా, జెమినీ కిరణ్, అశోక్ కుమార్, ఏడిద రాజా, బసిరెడ్డి, విజయేందర్ రెడ్డి, నరసింహారావు, శివనాగేశ్వరరావు, చంటి అడ్డాల తదితరులు హాజరయ్యారు.


ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడారు. ఆనాడు తెలుగు చలనచిత్ర పరిశ్రమను మద్రాస్ నుంచి హైదరాబాద్‌కు తీసుకురావాలనే ఉద్దేశంతో ఫిలిం నగర్ సోసైటీలో ఫిలిం ఛాంబర్‌ను ఏర్పాటు చేయటం జరిగిందని చెప్పారు. ఇక్కడి స్పేస్ పూర్తిగా చిత్రపరిశ్రమ అవసరాల కోసమే ఉపయోగపడాలని డిమాండ్ చేశారు. నటుడు మురళీ మోహన్ మాట్లాడుతూ.. చైన్నై నుంచి హైదరాబాద్ చిత్ర పరిశ్రమ రావటానికి ఫిలిం నగర్ సోసైటీలో ఫిలిం ఛాంబర్‌ను ఇచ్చారని.. ఇది కట్టి నలభై ఏళ్లు అయిందని చెప్పారు. దీనిని చిత్ర పరిశ్రమకు సంబంధించి తప్ప, వేరే వాటికి ఉపయోగించకూడదని కోరారు.


టాలీవుడ్ నిర్మాత అశోక్ కుమార్ మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమ స్దిరపడటం కోసం ఇక్కడ ఫిలిం ఛాంబర్‌ను ఏర్పాటు చేయటం జరిగిందని అన్నారు. ఒక్కొక్కటిగా ఇండస్ట్రీ కోసం నిర్మాతల సౌకర్యాల కోసం, అనేక ఆఫీసులు ఈ క్లాంప్లెక్స్‌లో ఏర్పాట్లు అయ్యాయని చెప్పారు. అభివృద్ధి జరిగితే అది చిత్రపరిశ్రమకే ఉపయోగపడేలా ఉండాలని చెప్పారు. ఫిలిం ఛాంబర్ అభివృద్దిపై సినీ పెద్దలు అందరూ కలిసికట్టుగా అందరికీ అమోదయోగ్యంగా ఉమ్మడి నిర్ణయం తీసుకోవాలన్నారు.


ఇవి కూడా చదవండి:

Meerpet Husband And Wife Case: మీర్‌పేట్ మర్డర్ కేస్.. వెలుగులోకి సంచలన విషయాలు..

Congress MLCs: బీఆర్ఎస్‌పై ఎన్నికల ఆర్వోకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీలు

Updated Date - Oct 27 , 2025 | 09:15 PM