Meerpet Husband And Wife Case: మీర్‌పేట్ మర్డర్ కేస్.. వెలుగులోకి సంచలన విషయాలు..
ABN , Publish Date - Oct 27 , 2025 | 06:56 PM
అక్టోబర్ 19వ తేదీ రాత్రి విజయ్ కుమార్ మద్యం మత్తులో ఇంటికి వచ్చాడు. సంధ్యతో గొడవపెట్టుకున్నాడు. తీవ్ర ఆగ్రహానికి గురైన సంధ్య చున్నీతో భర్త గొంతు బిగించి చంపింది.
మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న అనుమానాస్పద మరణం కేసు దర్యాప్తులో సంచలన విషయాలు(Chilling Case From Meerpet) వెలుగులోకి వచ్చాయి. భర్తను తానే గొంతు బిగించి చంపినట్లు భార్య ఒప్పుకుంది. భర్త ప్రతీ రోజూ తాగి వచ్చి హింసిస్తుండటంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలిపింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అక్టోబర్ 20వ తేదీన ప్రగతి నగర్ కాలనీ, జిల్లెలగూడకు చెందిన అలంపల్లి సత్యమ్మ అనే మహిళ తన పెద్ద కుమారుడు అలంపల్లి విజయ్ కుమార్ (42) అనుమానాస్పద స్థితిలో చనిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హత్య కోణంలో కూడా విచారణ చేశారు. పోస్టుమార్టం రిపోర్టులో మెడపై లిగేచర్ గుర్తులు కనిపించడంతో హత్య అనుమానం నిజమైంది. ఈ నేపథ్యంలోనే మృతుడి తమ్ముడు అలంపల్లి విజయ్ భాస్కర్ తన అన్న మరణానికి అన్న భార్య అలంపల్లి సంధ్య కారణమని పోలీసులకు తెలిపాడు. మర్డర్ గురించి ఆమే తనకు స్వయంగా చెప్పిందని అన్నాడు. పోలీసులు అక్టోబర్ 27వ తేదీన సంధ్యను అరెస్ట్(Alampalli Sandhya Arrest) చేశారు.
విచారణలో సంధ్య తెలిపిన వివరాల ప్రకారం.. భర్త మద్యం మత్తులో తరచూ ఆమెను కొట్టేవాడు. ఇతరులతో సంబంధం అంటకట్టి వేధించేవాడు. అక్టోబర్ 19వ తేదీ రాత్రి విజయ్ కుమార్ మద్యం మత్తులో ఇంటికి వచ్చాడు. సంధ్యతో గొడవపెట్టుకున్నాడు. తీవ్ర ఆగ్రహానికి గురైన సంధ్య చున్నీతో భర్త గొంతు బిగించి చంపింది. మర్డర్ కేసు నుంచి తప్పించుకోవడానికి భర్త అపస్మారక స్థితిలో ఉన్నట్లు నటించి ఆసుపత్రికి తీసుకెళ్లింది. వైద్యులు విజయ్ కుమార్ చనిపోయినట్లు ధ్రువీకరించారు. అతడి తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్తను హత్య చేయడానికి సంధ్య ఉపయోగించిన చున్నీ, తాడును(Police Seized The Weapons) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమెను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
ఇవి కూడా చదవండి
ఆ ప్రాంతాల్లో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి
రోహిత్, కోహ్లీపై గంభీర్ ప్రశంసలు.. ఏమన్నాడంటే..