Share News

Sangareddy: తెలంగాణ నుంచి ఝార్ఖండ్‌కు 16వేల కిలోల అమ్మోనియం నైట్రేట్‌

ABN , Publish Date - Feb 12 , 2025 | 04:49 AM

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా నుంచి ఝార్ఖండ్‌లోనే దేవ్‌గఢ్‌కు 16,000 కిలోల పేలుడు పదార్దం..

Sangareddy: తెలంగాణ నుంచి ఝార్ఖండ్‌కు 16వేల కిలోల అమ్మోనియం నైట్రేట్‌

  • పశ్చిమ బెంగాల్‌లో లారీ సీజ్‌.. ముగ్గురి అరెస్టు

కోల్‌కతా, ఫిబ్రవరి 11 : తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా నుంచి ఝార్ఖండ్‌లోనే దేవ్‌గఢ్‌కు 16,000 కిలోల పేలుడు పదార్దం.. అమ్మోనియం నైట్రేట్‌ను తరలిస్తున్న ఓ లారీని పశ్చిమ బెంగాల్‌ పోలీసులు పట్టుకున్నారు. అమ్మోనియం నైట్రేట్‌ తరలింపునకు సంబంధించి సరైన పత్రాలు లేకపోవడంతో బెంగాల్‌లోని బిర్‌భూమ్‌ జిల్లాలో మంగళవారం ఉదయం లారీని సీజ్‌ చేశారు. డ్రైవర్‌, క్లీనర్‌ సహా ముగ్గురిని అరెస్టు చేసి రామ్‌పుర్హత్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. లారీలోని అమ్మోనియం నైట్రేట్‌ పేలితే భారీ నష్టం తప్పదని పోలీసులు పేర్కొన్నారు.

Updated Date - Feb 12 , 2025 | 04:49 AM