Khanapur Sarpanch Auction: సంగారెడ్డి జిల్లా ఖానాపూర్ (కె) సర్పంచ్ పదవికి లక్షల్లో వేలం!
ABN , Publish Date - Dec 02 , 2025 | 07:26 AM
సంగారెడ్డి జిల్లా ఖానాపూర్ (కె) గ్రామంలో విచిత్రం చోటు చేసుకుంది. సర్పంచ్ పదవి కోసం బహిరంగ వేలం జరిగింది. పదవి కోసం ఇద్దరు అభ్యర్థులు లక్షల్లో చెల్లించేందుకు బరిలో నిలిచారు. అయితే, పాత విషయాల నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి వేలం వాయిదా పడంది.
ఇంటర్నెట్ డెస్క్: సంగారెడ్డి జిల్లా, కల్హేర్ మండలం ఖానాపూర్ (కె) గ్రామంలో సర్పంచ్ పదవి కోసం బహిరంగ వేలం జరిగింది. ఎస్టీ (జనరల్) అయిన ఈ పదవి కోసం ఇద్దరు అభ్యర్థులు తలపడ్డారు. బీఆర్ఎస్ మద్దతు పొందిన అభ్యర్థి రూ. 22.20 లక్షలు, బీజేపీ మద్దతున్న అభ్యర్థి రూ. 25 లక్షల వరకు చెల్లించేందుకు సిద్ధమని ప్రకటించారు.
గ్రామసభ ముందే ఈ బేరసారాలు జరిగాయి. అయితే ఓ అభ్యర్థి గతంలో బెల్ట్‌షాప్ వేలం గెలిచి డబ్బు సక్రమంగా చెల్లించలేది లేదనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి, గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. చివరికి వేలం వాయిదా పడింది. ఈ ఖానాపూర్ (కె) గ్రామం మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ (భూపాల్ రెడ్డి), ప్రస్తుత ఎమ్మెల్యే టి. విజయ్ పాల్ రెడ్డి స్వగ్రామం కావడం విశేషం.
అయినప్పటికీ ఇక్కడ సర్పంచి పదవి కోసం రూ. లక్షల్లో బేరం జరగడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్థానికంగా పంచాయతీ శాఖ అధికారులు, పోలీసులు పరిస్థితిని అదుపులో ఉంచారు. కొత్త తేదీ ప్రకటించి మళ్లీ వేలం నిర్వహించే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు.
ఇవీ చదవండి:
ఐటీ రిఫండ్స్ ఇంకా రాలేదా? అయితే..
ప్రమోషనల్ స్కీములపై జీఎస్‌టీ ఉంటుందా?
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి