Share News

Sandeep Mathur: దక్షిణ మధ్య రైల్వే జీఎంగా సందీప్‌ మాథుర్‌

ABN , Publish Date - Jul 02 , 2025 | 03:59 AM

దక్షిణ కోస్తా రైల్వే(ఎ్‌స.సి.ఓ.ఆర్‌) జనరల్‌ మేనేజర్‌ సందీప్‌ మాథుర్‌ మంగళవారం దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించారు.

Sandeep Mathur: దక్షిణ మధ్య రైల్వే జీఎంగా సందీప్‌ మాథుర్‌

హైదరాబాద్‌, జూలై 1 (ఆంధ్రజ్యోతి): దక్షిణ కోస్తా రైల్వే(ఎ్‌స.సి.ఓ.ఆర్‌) జనరల్‌ మేనేజర్‌ సందీప్‌ మాథుర్‌ మంగళవారం దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌గా పని చేసిన అరుణ్‌కుమార్‌ జైన్‌ పదవీ విరమణతో ఖాళీ అయిన ఆ పోస్టులో సందీప్‌ మాథుర్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రైల్వేబోర్డు ఆదేశాలు జారీ చేసింది. సికింద్రాబాద్‌లోని రైల్‌ నిలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం సందీప్‌ మాథుర్‌ జోన్‌లోని వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Updated Date - Jul 02 , 2025 | 03:59 AM