Share News

Komatireddy Venkat Reddy: హ్యామ్‌లో ఎక్కువ ట్రాఫిక్‌ ఉన్న రోడ్లకే ప్రాధాన్యం

ABN , Publish Date - Aug 26 , 2025 | 03:42 AM

హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌ (హ్యామ్‌)లో ఎక్కువ ట్రాఫిక్‌ ఉన్న రోడ్లకే ప్రాధాన్యమివ్వాలని రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి....

Komatireddy Venkat Reddy: హ్యామ్‌లో ఎక్కువ ట్రాఫిక్‌ ఉన్న రోడ్లకే ప్రాధాన్యం

  • రోడ్ల మరమ్మతులకు 100 కోట్లు అవసరం

  • హ్యామ్‌ కింద 4వేల కి.మీ రోడ్ల పునరుద్ధరణ

  • ఆర్‌ఆర్‌ఆర్‌ బాధితులకు పరిహారం చెల్లించండి

  • హ్యామ్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష

హైదరాబాద్‌, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌ (హ్యామ్‌)లో ఎక్కువ ట్రాఫిక్‌ ఉన్న రోడ్లకే ప్రాధాన్యమివ్వాలని రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌ ఎర్రమంజిల్‌లోని ఆర్‌ అండ్‌ బీ కేంద్ర కార్యాలయంలో హ్యామ్‌పై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 10 కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉన్న రోడ్లనే ఈ ప్రాజెక్టు కిందకు తీసుకోవాలని సూచించారు. హ్యామ్‌ కింద చేపట్టే రోడ్లు గ్రామీణ ప్రాంతాలకు అనుసంధాన కారిడార్లుగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురై వెనుకబడిన జిల్లాలకు హ్యామ్‌లో మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులకు కొత్తగా భూ సేకరణ అవసరం లేదని, ప్రస్తుతమున్న రోడ్లనే ఒక వరుస నుంచి రెండు వరుసలుగా విస్తరిస్తామని చెప్పారు. దాదాపు 4 వేల కి.మీ రోడ్లను పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి వివరించారు. ఇటీవల కురిసిన వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుల కోసం రూ. 100 కోట్లు మంజూరు చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసి కోరుతానని తెలిపారు. రీజినల్‌ రింగు రోడ్డు ఉత్తరభాగం భూసేకరణలో భూమి కోల్పోయిన వారికి వెంటనే పరిహారం చెల్లించాలని అధికారులను ఆదేశించారు. అలాగే హైకోర్టు, ఉస్మానియా ఆసుపత్రి ప్రధాన భవనాలను వచ్చే రెండేళ్లలో పూర్తిచేసేలా లక్ష్యం విధించుకున్నట్లు మంత్రి వెల్లడించారు.


ఇవి కూడా చదవండి..

ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా రైతులకు హాని జరగనీయం.. అమెరికా టారిఫ్‌లపై మోదీ

ట్రంప్ టారిఫ్‌లపై పీఎంవో కీలక సమావేశం

For More National News

Updated Date - Aug 26 , 2025 | 03:42 AM