Share News

Robbery: రోడ్డు పక్కన కారులో నిద్రిస్తున్న వారిపై దాడి, చోరీ

ABN , Publish Date - Aug 15 , 2025 | 04:23 AM

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలంలోని బూచనెల్లి గ్రామశివారులో 65వ నెంబరు జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి చోరీ జరిగింది.

Robbery: రోడ్డు పక్కన కారులో నిద్రిస్తున్న వారిపై దాడి, చోరీ

  • సంగారెడ్డి జిల్లాలోని జాతీయ రహదారిపై ఘటన

జహీరాబాద్‌, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలంలోని బూచనెల్లి గ్రామశివారులో 65వ నెంబరు జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. రహదారి పక్కన కారు ఆపి నిద్రిస్తున్న ప్రయాణికులపై దుండగులు కత్తితో దాడి చేసి రెండు తులాల బంగారు ఆభరణాన్ని దొంగలించి పరారయ్యారు. చిరాగ్‌పల్లి ఎస్సై రాజేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన కృష్ణారెడ్డి కుటుంబం ముంబైలో స్థిరపడింది.


హైదరాబాద్‌లోని బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరైన కృష్ణారెడ్డి దంపతులు, వారి స్నేహితుడు వెంకటేశం, అతని భార్యతో కలిసి కారులో ముంబై తిరుగు ప్రయాణమయ్యారు. వీరు మార్గమధ్యలో బూచనెల్లి సమీపంలోని ఓ పెట్రోల్‌ బంకు వద్ద రోడ్డు పక్కన కారు ఆపి నిద్రించారు. అయితే, అర్ధరాత్రి తర్వాత ముగ్గురు దుండగులు వీరిపై కత్తితో దాడి చేసి కృష్ణారెడ్డి భార్య మెడలోని బంగారు ఆభరణాన్ని ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో కృష్ణారెడ్డికి గాయాలయ్యాయి. కేసు దర్యాప్తులో ఉంది.

Updated Date - Aug 15 , 2025 | 04:23 AM