RGUKT Admissions 2025: ఆర్జీయూకేటీ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల
ABN , Publish Date - May 28 , 2025 | 05:00 PM
2025-26 విద్యా సంవత్సరానికి బాసర ఆర్జీయూకేటీ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు వర్సిటీ వీసి గోవర్ధన్ నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలను తెలిపారు.
RGUKT Admissions 2025: రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీస్ 2025-26 విద్యా సంవత్సరానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు వర్సిటీ వీసి ప్రొఫెసర్ గోవర్ధన్ ప్రకటన విడుదల చేశారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలను యూవర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
బాసర క్యాంపస్‌లో 1500 సీట్లు
ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్‌కు సంబంధించిన ప్రవేశ షెడ్యూల్‌తో పాటు ఇతర వివరాలను అందులో తెలిపారు. బాసర క్యాంపస్‌లో 1500 సీట్లు, మహబూబ్ నగర్ కొత్త క్యాంపస్‌లో 180 సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 31 నుంచి జూన్ 21 వరకు ఆన్ లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. పదో తరగతి మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది.
కాగా, మహబూబ్‌నగర్‌లో కొత్త RGUKT IIIT క్యాంపస్‌కు అనుమతి లభించింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి అక్కడ క్లాసులు ప్రారంభం కానున్నాయి. కొత్త క్యాంపస్‌లో మూడు కొత్త కోర్సులు అందుబాటులోకి తీసుకురానున్నారు. CSE, AI & ML, డేటా సైన్స్ కోర్సులు ప్రారంభించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. RGUKT బాసర ఆధ్వర్యంలోనే మహబూబ్‌నగర్ క్యాంపస్ నడవనుంది.
Also Read:
వావ్.. సూపర్ ఐడియా.. వాటర్ బాటిల్‌తో ఇంత లైటింగ్ వస్తుందా.. వీడియో వైరల్
ఆపరేషన్ సిందూర్.. రేపు ఈ రాష్ట్రాల్లో మాక్ డ్రిల్
For More Telugu And National News