Share News

Thota Vaikuntam: తెలంగాణ పల్లె సంస్కృతే నాకు ప్రేరణ

ABN , Publish Date - May 01 , 2025 | 04:28 AM

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పల్లె సంస్కృతే తన చిత్రాలకు ప్రధాన ప్రేరణ అని ప్రముఖ చిత్రకారుడు తోట వైకుంఠం అన్నారు. కరీంనగర్‌ జిల్లా బూరుగుపల్లి గ్రామ వాతావరణం తనను చిత్రకారుడిగా మలచిందన్నారు.

Thota Vaikuntam: తెలంగాణ పల్లె సంస్కృతే నాకు ప్రేరణ

  • ప్రముఖ చిత్రకారుడు తోట వైకుంఠం

  • ఆయనకు ప్రతిష్ఠాత్మక యుద్ధవీర్‌ పురస్కారం ప్రదానం

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పల్లె సంస్కృతే తన చిత్రాలకు ప్రధాన ప్రేరణ అని ప్రముఖ చిత్రకారుడు తోట వైకుంఠం అన్నారు. కరీంనగర్‌ జిల్లా బూరుగుపల్లి గ్రామ వాతావరణం తనను చిత్రకారుడిగా మలచిందన్నారు. యుద్ధవీర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో బుధవారం రెడ్‌హిల్స్‌లోని ఎఫ్‌టీసీసీఐలో తోట వైకుంఠంకు 32వ ప్రతిష్ఠాత్మక యుద్ధవీర్‌ స్మారక పురస్కార ప్రదానోత్సవం జరిగింది. తెలంగాణ పల్లెదనాన్ని కాన్వా్‌సపై ప్రతిబింబించి అంతర్జాతీయ స్థాయిలో తెలుగు చిత్రకళ ప్రత్యేకతను చాటిన అరుదైన వ్యక్తి తోట వైకుంఠం అని ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. ఆయన కుంచెనుంచి జాలువారిన చిత్రాల్లో శ్రమైక జీవన సౌందర్యం ఉట్టిపడుతుందన్నారు.


దక్కనీ కవి నరేంద్ర రాయ్‌శ్రీ వాస్తవ్‌ మాట్లాడుతూ ‘మాభూమి’, ‘దాసి’ సినిమాలకు వైకుంఠం కళాదర్శకుడిగా పనిచేశారని.. లండన్‌, న్యూయార్క్‌, క్యాలిఫోర్నియా, సింగపూర్‌, హాంకాంగ్‌ల్లోని ప్రతిష్ఠాత్మక గ్యాలరీల నుంచి చిత్ర ప్రదర్శనకు ఆయన ఆహ్వానం అందుకున్నారని తెలిపారు. యుద్ధవీర్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ విశ్రాంత ఐపీఎస్‌ అరుణా బహుగుణ, కార్యదర్శి విప్మావీర్‌, ఎమ్మెల్సీ మీర్‌ అమీర్‌ అలీఖాన్‌ మాట్లాడుతూ.. వైకుంఠం గీసిన చిత్రాలకు దేశ, విదేశాల్లో అమితాదరణ ఉందని, ఇది తెలంగాణకు గర్వకారణమన్నారు. తోట వైకుంఠంకు జ్ఞాపికతోపాటు రూ.లక్ష నగదు బహుమతిని నిర్వాహకులు అందజేశారు.


Also Read:

BR Ambedkar: అంబేడ్కర్, అఖిలేష్‌ చెరిసగం ఫోటో .. విమర్శలు గుప్పించిన బీజేపీ

Fish Viral Video: ప్రయత్నాలు ఎప్పుడూ వృథా కావు.. ఈ చేప ఏం చేసిందో చూస్తే..

Haunted Tours: ఆశ్చర్యం కాదు..దెయ్యాల రాష్ట్రాల గురించి తెలుసా మీకు..

Updated Date - May 01 , 2025 | 04:28 AM