గ్రామసభల్లో దరఖాస్తుల వెల్లువ!
ABN , Publish Date - Jan 25 , 2025 | 03:48 AM
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిర్వహించిన గ్రామ సభల్లో నాలుగు పథకాలకు.. కొత్తగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఈ పథకాల అమలు జాబితాలో పేర్లు లేనివారంతా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలంటూ..

మరోసారి సభలు పెట్టే అవకాశం
రాష్ట్రవ్యాప్తంగా ముగిసిన కార్యక్రమం
హైదరాబాద్, జనవరి 24 (ఆంధ్రజ్యోతి) : గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిర్వహించిన గ్రామ సభల్లో నాలుగు పథకాలకు.. కొత్తగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఈ పథకాల అమలు జాబితాలో పేర్లు లేనివారంతా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలంటూ.. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు చెబుతుండటంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, కొత్త రేషన్‌కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు ఒక్కోదానికి వేలసంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఆయా పథకాలకు అర్హులను గుర్తించడంలో భాగంగా.. రాష్ట్రంలో నాలుగు రోజులుగా చేపట్టిన గ్రామసభల నిర్వహణ శుక్రవారం ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 12,769 పంచాయతీలు, పురపాలికల్లోని 2,387 వార్డుల పరిధిలో గ్రామసభలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
జనగామ జిల్లాలో రేషన్‌కార్డుల కోసం 14,532, ఇందిరమ్మ ఇళ్ల కోసం 13,955, రైతుభరోసాకు 491, ఆత్మీయ భరోసాకు 5,270 దరఖాస్తులు వచ్చాయి. గద్వాల జిల్లాలో రేషన్ కార్డుల కోసం 23,197, ఇందిరమ్మ ఇళ్ల కోసం 10,955, రైతు భరోసాకు 917, ఆత్మీయ భరోసా లబ్ధికి 7,105, ఆదిలాబాద్ జిల్లాలో రేషన్‌కార్డుల కోసం 32,727, ఇందిరమ్మ ఇళ్ల కోసం 16,730, రైతు భరోసాకు 387 దరఖాస్తులు అందాయి. 4 సంక్షేమ పథకాల అర్హులకు లబ్ధి చేకూరే విధంగా 26న ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Virender Sehwag: విడాకులు తీసుకోనున్న వీరేంద్ర సెహ్వాగ్..
Kaleshwaram Commission: నేటి కాళేశ్వరం విచారణ.. అత్యంత కీలకం