Share News

Sangareddy: ‘మాటా’ అధ్యక్షుడిగా రమణకృష్ణ కిరణ్‌

ABN , Publish Date - Feb 17 , 2025 | 04:31 AM

అమెరికాలోని ప్రముఖ తెలుగు సంఘం మన అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌(మాటా) నూతన అధ్యక్షుడిగా సంగారెడ్డికి చెందిన రమణ కృష్ణ కిరణ్‌ దుద్దాగి ఎన్నికయ్యారు.

Sangareddy: ‘మాటా’ అధ్యక్షుడిగా రమణకృష్ణ కిరణ్‌

సంగారెడ్డి టౌన్‌, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): అమెరికాలోని ప్రముఖ తెలుగు సంఘం మన అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌(మాటా) నూతన అధ్యక్షుడిగా సంగారెడ్డికి చెందిన రమణ కృష్ణ కిరణ్‌ దుద్దాగి ఎన్నికయ్యారు. 2025-2026 సంవత్సరానికి గాను 250 మంది సభ్యులతో మాటా నూతన కార్యవర్గం కూడా ఏర్పాటైంది. అమెరికాలోని డల్లా్‌సలో జరిగిన సమావేశంలో రమణకృష్ణ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. మాటా వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాస్‌ ఘనగోనితో పాటు ప్రదీప్‌ తమల జితేందర్‌ రెడ్డిలు సలహా మండలి సభ్యులుగా బాధ్యతలు స్వీకరించారు.


అలాగే మాటా ఉపాధ్యక్షుడిగా ప్రవీణ్‌ గూడూరు, కార్యదర్శిగా విజయభాస్కర్‌, కోశాధికారిగా శ్రీధర్‌ గుడాల, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా నగేష్‌ చిలకపాటి, నేషనల్‌ కోఆర్డినేటర్‌గా టోనీ జన్ను, జాయింట్‌ సెక్రటరీగా రాజ్‌ ఆనంద్‌, కమ్యూనిటీ సర్వీస్‌ డైరెక్టర్‌గా స్వాతి కళ్యాణరెడ్డి తదితరులు ఎన్నికయ్యారు. రమణకృష్ణ మాటా అధ్యక్షుడిగా ఎన్నికవ్వడంపై సంగారెడ్డి ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - Feb 17 , 2025 | 04:31 AM