POSH Sumit:బండి సంజయ్‌తో పర్‌వ్యూ గ్రూప్ సిహెచ్ఆర్ఓ కుమార్ రాజా భేటీ.. అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానం
ABN , Publish Date - Aug 09 , 2025 | 11:25 PM
విద్యార్థులకు ఆచరణాత్మక అనుభవాన్ని అందించేందుకు పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతపై ఇద్దరు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ రకమైన సహకారం వలన విద్యార్థులు తమ చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగాలకు సిద్ధంగా ఉంటారని ..
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను పర్‌వ్యూ గ్రూప్ చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ డాక్టర్ కుమార్ రాజా చిట్టూరి కరీంనగర్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సమావేశంలో యువత నైపుణ్యాభివృద్ధి, విద్యా-పరిశ్రమల అనుసంధానం, మహిళల ఉపాధి వంటి కీలక అంశాలపై చర్చించారు. ఈ భేటీలో ప్రధానంగా విద్యా వ్యవస్థకు, పరిశ్రమల అవసరాలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడంపై చర్చించారు. డాక్టర్ కుమార్ రాజా చిట్టూరి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు, వారి నైపుణ్యాలను మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడం, ఔత్సాహిక వ్యాపారవేత్తలను ప్రోత్సహించడం, మహిళలు అధిక సంఖ్యలో ఉపాధి రంగంలోకి వచ్చేలా ప్రోత్సహించాల్సిన అవసరం గురించి ఇరువురూ చర్చించారు.

విద్యార్థులకు ఆచరణాత్మక అనుభవాన్ని అందించేందుకు పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతపై ఇద్దరు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ రకమైన సహకారం వలన విద్యార్థులు తమ చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగాలకు సిద్ధంగా ఉంటారని వారు అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా, డాక్టర్ కుమార్ రాజా చిట్టూరి పర్‌వ్యూ గ్రూప్ త్వరలో నిర్వహించనున్న 'POSH అంతర్జాతీయ సదస్సు'కు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను అధికారికంగా ఆహ్వానించారు. ఈ సదస్సు కార్యాలయాలలో సమానత్వం, భద్రత, వృత్తిపరమైన అభివృద్ధి వంటి అంశాలపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, నిపుణులు చర్చించుకునే వేదిక కానుంది. ఈ కార్యక్రమం కార్యాలయ వాతావరణంలో సానుకూల మార్పులకు దోహదపడుతుందని డాక్టర్ కుమార్ రాజా చిట్టూరి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
గువ్వల రాజీనామా.. స్పందించిన బీఆర్ఎస్
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి