Share News

Gaddam Lakshman: హక్కులను హరిస్తున్న పాలకులు

ABN , Publish Date - May 12 , 2025 | 05:05 AM

పాలకులు రాజ్యాంగం ద్వారా పౌరులకు సంక్రమించిన హక్కులను హరిస్తున్నారని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌ అన్నారు.

Gaddam Lakshman: హక్కులను హరిస్తున్న పాలకులు

  • పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్‌

వడ్డెపల్లి, మే 11 (ఆంధ్రజ్యోతి): పాలకులు రాజ్యాంగం ద్వారా పౌరులకు సంక్రమించిన హక్కులను హరిస్తున్నారని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌ అన్నారు. ఆదివారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సంఘం ఉమ్మడి వరంగల్‌ జిల్లా మూడో మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆదివాసీలపై అకృత్యాలు చూడలేకే మావోయిస్టులు శాంతి చర్చల ప్రతిపాదన తీసుకొచ్చారన్నారు. మావోయిస్టులకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా డెడ్‌లైన్‌ పెట్టడం సబబు కాదన్నారు.


కేంద్ర ప్రభుత్వం అపారమైన ఖనిజ సంపదను కొల్లగొట్టేందుకు కుయుక్తులు పన్నుతోందని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్‌.నారాయణరావు ఆరోపించారు. ఆపరేషన్‌ కగార్‌ను నిలిపివేయాలని, మావోయిస్టులతో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో పాటు కేంద్రం చర్చలు జరుపాలని పౌర హక్కుల సంఘం ఉమ్మడి వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు పి.రమేశ్‌చందర్‌ ప్రవేశపెట్టిన తీర్మాణాన్ని మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.


ఇవి కూడా చదవండి

Drunk Driving Incident: మద్యం తాగుతూ ఫుల్ స్పీడ్‌తో రైడ్.. వీడియో వైరల్

Donald Trump: విదేశాల్లో నిర్మించిన చిత్రాలపై 100% సుంకం..ఆ జైలు తిరిగి ప్రారంభిస్తాం

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 12 , 2025 | 05:05 AM