శ్రీశైల మల్లన్నకు చీరాల తలపాగా సిద్ధం
ABN , Publish Date - Feb 24 , 2025 | 04:20 AM
శ్రీశైల మల్లన్నకు మహాశివరాత్రి నాడు ధరింపజేసే తలపాగాను తయారు చేసే అవకాశం బాపట్ల జిల్లా చీరాల మండలం దేవాంగపురికి చెందిన పృథివి సుబ్బారావుకు దక్కింది.

ఈ దఫా పృథివి సుబ్బారావుకు దక్కిన అవకాశం
చీరాల, ఫిబ్రవరి23 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల మల్లన్నకు మహాశివరాత్రి నాడు ధరింపజేసే తలపాగాను తయారు చేసే అవకాశం బాపట్ల జిల్లా చీరాల మండలం దేవాంగపురికి చెందిన పృథివి సుబ్బారావుకు దక్కింది. దశాబ్దాల కాలంగా సుబ్బారావు పూర్వీకులే మల్లన్న తలపాగాను మగ్గంపై స్వయంగా తయారు చేసి స్వామి తలకు చుట్టే ఆనవాయితీ కొనసాగిస్తున్నారు. ఇటీవల సుబ్బారావు తండ్రి వెంకటేశ్వర్లు అనారోగ్యంబారిన పడడంతో ఈ ఏడాది ఆయన కుమారుడు సుబ్బారావుకు అవకాశం దక్కింది. 3 నెలలపాటు శ్రమించి 360 మూరల పొడవున్న తలపాగాను తయారు చేశారు. దాన్ని ఆదివారం సుబ్బారావు, దుర్గ దంపతులు శ్రీశైలం తీసుకెళ్లారు.