Share News

RS Praveen Kumar: మేడిగడ్డ బ్యారేజీని బాంబులతో పేల్చారు

ABN , Publish Date - Aug 17 , 2025 | 05:22 AM

కేసీఆర్‌ను గద్దె దించడానికి మేడిగడ్డ బ్యారేజీని బాంబులతో పేల్చారని బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌, బీజేపీ కలిసి చేసిన ఈ కుట్రపై సిట్‌ విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు

RS Praveen Kumar: మేడిగడ్డ బ్యారేజీని బాంబులతో పేల్చారు

  • కేసీఆర్‌ను గద్దె దించడానికి కాంగ్రెస్‌, బీజేపీ కలిసి చేసిన కుట్ర

  • బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

హైదరాబాద్‌, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): కేసీఆర్‌ను గద్దె దించడానికి మేడిగడ్డ బ్యారేజీని బాంబులతో పేల్చారని బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌, బీజేపీ కలిసి చేసిన ఈ కుట్రపై సిట్‌ విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. మట్టి, ఇసుక కుంగడం వల్ల ప్రమాదం జరిగితే స్తంభాలకు పగుళ్లు రావని, కానీ మేడిగడ్డ వద్ద వచ్చాయని ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. జెలిటిన్‌ స్టిక్స్‌, డిటోనేటర్లు వంటి పేలుడు పదార్థాలు వాడితేనే ఇలాంటివి జరుగుతాయని ఇంజనీరింగ్‌ నిపుణులు చెబుతున్నారని తెలిపారు.


2023 అక్టోబరు 21న మేడిగడ్డ బ్యారేజీ వద్ద భారీ పేలుడు శబ్దాలు వచ్చి రెండు కిలోమీటర్ల మేర ధ్వని వినిపించిందని రవికాంత్‌ అనే ఇంజనీర్‌ ఫిర్యాదు చేయగా మహదేవ్‌పూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారని ప్రవీణ్‌ చెప్పారు. అసాంఘిక శక్తులు బ్యారేజీని కూల్చడానికి కుట్ర చేసినట్టు సదరు ఇంజనీర్‌ ఫిర్యాదులో పేర్కొన్నా.. పోలీసులు పట్టించుకోలేదని, కేసు రెండేళ్లుగా పెండింగ్‌లోనే ఉందని వాపోయారు. ఈ కేసును విచారించి, నిజానిజాలు తేల్చాలని ప్రవీణ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తృటిలో తప్పిన ప్రమాదం.. విమాన ప్రయాణికులు సురక్షితం

రాహుల్ గాంధీ ఆరోపణలు.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

మరిన్ని తెలంగాణ వార్తలు, తెలుగు వార్తలు చదవండి..

Updated Date - Aug 17 , 2025 | 05:22 AM