Share News

Vemula Prashant ReddY: చెల్లికి పెళ్లి జరగాలి మళ్లీ మళ్లీ.. అనేలా అమిత్‌షా తీరు ప్రశాంత్‌రెడ్డి

ABN , Publish Date - Jun 30 , 2025 | 06:50 AM

నిజామాబాద్‌లో జరిగిన పసుపు బోర్డు ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేంద్ర మంత్రి అమిత్‌ షా తీరు చూస్తుంటే, మా చెల్లికి పెళ్లి జరగాలి మళ్లీ మళీ చందంగా ఉందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డి ఎద్దేవా చేశారు.

Vemula Prashant ReddY: చెల్లికి పెళ్లి జరగాలి మళ్లీ మళ్లీ.. అనేలా అమిత్‌షా తీరు ప్రశాంత్‌రెడ్డి

హైదరాబాద్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి):నిజామాబాద్‌లో జరిగిన పసుపు బోర్డు ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేంద్ర మంత్రి అమిత్‌ షా తీరు చూస్తుంటే, ‘మా చెల్లికి పెళ్లి జరగాలి మళ్లీ మళీ’ అన్న చందంగా ఉందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇంతకుముందే ఉన్న తాత్కాలిక కార్యాలయాన్ని వేరే కిరాయి బిల్డింగ్‌కు మార్చి అమిత్‌షాతో ప్రారంభోత్సవం చేయించారని ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.


పసుపు రైతులకు కావాల్సింది తాత్కాలిక ఆఫీసులు, రెండు సార్లు ప్రారంభోత్సవాలు కాదన్నారు. దేశంలో 70ు పసుపు తెలంగాణలోనే పండుతుందని, నాలుగు దశాబ్దాలుగా పసుపు పంటకు మద్దతు ధర కోసం, బోర్డు కోసం పోరాటాలు చేస్తున్నారని గుర్తు చేశారు. తమ ప్రభుత్వ హయాంలో కల్వకుంట్ల కవిత, తాము ప్రయత్నం చేసినా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సహకరించలేదన్నారు.

Updated Date - Jun 30 , 2025 | 06:50 AM