Share News

Electricity: నగరంలో నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలివే..

ABN , Publish Date - Jul 11 , 2025 | 06:54 AM

బంజారాహిల్స్‌ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ జి.గోపీ తెలిపారు.

Electricity: నగరంలో నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలివే..

హైదరాబాద్: బంజారాహిల్స్‌(Banjara Hills) ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ జి.గోపీ(ADE G.Gopi) తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 11కేవీ జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్‌.20, 86 ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లోనూ, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11 కేవీ జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌, భారతీయ విద్యాభవన్‌ స్కూల్‌ ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లోనూ, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు 11కేవీ జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్‌.24 ఫీడర్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లోనూ విద్యుత్‌ అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు.


కేపీహెచ్‌బీకాలనీ: టీజీఎస్సీడీసీఎల్‌ కేపీహెచ్‌బీ, బాలాజీనగర్‌ సెక్షన్ల పరిధిలో చెట్ల కొమ్మల తొలగింపు కోసం శనివారం పలు ప్రాంతాల్లో కరెంట్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈలు విజయప్రకాష్‌, భీమలింగప్ప వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు.

కేపీహెచ్‌బీలో..

ట్రినిటీ చర్చి, భువన విజయం గ్రౌండ్‌, రవి హాస్పిటల్‌, రాంరెడ్డి మిల్క్‌ సెంటర్‌లో ఉదయం10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు.. హౌసింగ్‌బోర్డు ఫంక్షన్‌ హాల్‌, ఈడబ్ల్యూఎస్‌, ఎంఐజీ 600-935, టెంపుల్‌ బస్టాపులో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్‌ ఉండదన్నారు.


బాలాజీనగర్‌లో..

బాలాజీనగర్‌, సాయుబాబా ఆలయం, రాందేవ్‌రావు హాస్పిటల్‌, ఓమ్ని హాస్పిటల్‌, ఆకార్‌ హాస్పిటల్‌, బిగ్‌ సి షోరూం ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు.. పీపుల్స్‌ హాస్పిటల్‌, వివేక్‌నగర్‌, ప్రతిభ డిగ్రీ కాలేజ్‌, కమ్యూనిటీ హాల్‌, న్యూ బాలాజీనగర్‌, వైఎ్‌సఆర్‌ విగ్రహం, హనుమాన్‌ టెంపుల్‌, యోగ్యతా అపార్ట్‌మెంట్‌ ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్‌ సరఫరా ఉండదని పేర్కొన్నారు.

చిక్కడపల్లి: మరమ్మతుల కారణంగా శుక్రవారం పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నామని ఆజామాబాద్‌ ఏడీఈ నాగేశ్వర్‌రావు తెలిపారు. ఆంబర్‌పేట పరిధిలోని ఎంసీహెచ్‌ కాలనీ, ఆకాశ్‌నగర్‌ తదితర ప్రాంతాలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, ప్లేగ్రౌండ్‌ పరిధిలోని ఎరుకల బస్తీ, గాంధీ విగ్రహం తదితర ప్రాంతాలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటలవరకు విద్యుత్‌ సరఫరా ఉండదని ఏడీఈ పేర్కొన్నారు.


city1.2.gif

ఉప్పల్‌: విద్యుత్‌ లైన్‌ల మార్పులు, ఇతర మరమ్మతుల కారణంగా శుక్రవారం వివిధ ఫీడర్ల పరిధిలో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఉప్పల్‌ భగాయత్‌ ఏఈ బి.కిరణ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. ఉప్పల్‌ ఫీడర్‌ పరిధిలోని లక్ష్మారెడ్డి కాలనీ, రాఘవేంద్ర కాలనీ, సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయం వీధి, సూర్యా నగర్‌, హనుమసాయి నగర్‌, సరస్వతీ కాలనీ, పాన్‌ ఏషియా హాస్పిటల్‌ వీధి పరిసర ప్రాంతాలలో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంట ల వరకు కరెంటు సరఫరా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. శాంతి నగర్‌ ఫీడర్‌ పరిధిలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శాంతినగర్‌, బాలాజీ నర్సింగ్‌ హోం వీధి, ర్యాంకర్స్‌ స్కూల్‌ వీధి, శ్రీ బాలాజీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ వీధి పరిసర ప్రాంతాలలో విద్యుత్‌ సరఫరా ఉండదని, వినియోగదారులు తమ సిబ్బందితో సహకరించాలని ఆయన కోరారు.


పేట్‌బషీరాబాద్‌: విద్యుత్‌ తీగలకు అడ్డుగా ఉన్న చెట్లకొమ్మలు తొలిగించే పనుల కారణంగా కొంపల్లి విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ పరిధిలోని కింది ప్రాంతాల్లో శుక్రవారం విద్యుత్‌ సరఫరా ఉండదని ఏఈ శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విజయ శాంతి విల్లాస్‌, ఎన్‌సీఎల్‌ నోబుల్‌ ఎన్‌క్లేవ్‌ సువిల్లా సుకేతన్‌ విల్లాస్‌, సినీప్లానెట్‌, కేవీఆర్‌ గార్డెన్‌ రోడ్డు, శివారెడ్డి, మల్లికార్జున్‌ గోదామ్‌ ప్రాంతాల్లో విద్యుత్‌ ఉండదన్నారు. అలాగే, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రుద్ర అపార్టుమెంట్స్‌, హోటల్‌, మోడీ-1,2 అపార్టుమెంట్స్‌, ఎంఎల్‌ఏ మల్లారెడ్డి ఇల్లు, శివ శివాని స్కూల్స్‌, కాలేజీలు, ప్రజై, ఎన్‌ సాయి అపార్టుమెంట్స్‌లో విద్యుత్‌ ఉండదన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

నిమ్స్‌ మ్యాన్‌హోల్లో శిశువు మృతదేహం

నకిలీ పోలీసుల ముఠా గుట్టు రట్టు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 11 , 2025 | 06:54 AM