Electricity: ఆ ఏరియాల్లో.. 10 గంటల నుంచి కరెంంట్ కట్..
ABN , Publish Date - Jun 30 , 2025 | 07:27 AM
మరమ్మతుల కారణంగా బంజారాహిల్స్(Banjara Hills) ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో సోమవారం విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏడీఈ జి.గోపి(ADE G.Gopi) తెలిపారు.
- నగరంలో.. నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలివే..
హైదరాబాద్: మరమ్మతుల కారణంగా బంజారాహిల్స్(Banjara Hills) ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో సోమవారం విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏడీఈ జి.గోపి(ADE G.Gopi) తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 11కేవీ రోడ్ నెంబర్ 5, దేవరకొండ బస్తీ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11కేవీ మీనాక్షి, శబ్దాలయ స్టూడియో ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు.
- మరమ్మతుల కారణంగా గ్రీన్‌ల్యాండ్స్ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో సోమవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ చరణ్‌సింగ్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 11కేవీ సాయిరాంనగర్, ఆర్బీఐఫీడర్ల పరిధిలో, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11కేవీ పిలీదర్గా, బేగంపేట నాలా, ఐజీపురం ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌లో అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు.
చిక్కడపల్లి: ఆజామాబాద్ డివిజన్(Azamabad Division), హైదరాబాద్ సిటీ-1 పరిధిలో సోమవారం విద్యుత్ సరఫరా ఉండదని ఏడీఈలు నాగేశ్వరరావు, వినోద్‌కుమార్ తెలిపారు. బౌద్ధనగర్, సెవెన్ టెంపుల్, తాజ్‌మహల్, కింగ్‌కోఠి పరిధుల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, జామైఉస్మానియా, హిందీ ప్రచారసభ, కలెక్టర్ ఆఫీస్ పరిధిలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటలవరకు విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు.

సైదాబాద్: టీఎస్ఎస్పీడీసీఎల్ ఆస్మాన్‌ఘడ్ డివిజన్ పరిధిలోని మరమ్మతు పనుల కారణంగా సోమవా రం 11కేవీ పూర్ణోదయకాలనీ ఫీడర్ పరిధిలోని పరిసర ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి మధ్యా హ్నం 12గంటల వరకు, శాలివాహననగర్ ఫీడ ర్ పరిధిలోని పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం 2.30నుంచి సాయంత్రం 5.30గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని డీఈ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.
గాజులరామారం: గాజులరామారం విద్యుత్ సబ్-స్టేషన్ పరిధిలోని 11 కేవీ మహాదేవపురం, గాజుల రామారం, ఉషోదయ ఫీడర్ల పరిధిలో జీహెచ్‌ఎంసీ రోడ్డు పనుల కారణంగా సోమవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపి వేస్తామని ఏఈ చైతన్య భార్గవ్ తెలిపారు. వీఎస్‌ఆర్ అపార్టుమెంట్, గాజులరామారం మహా రాజా గార్డెన్ లేన్, వల్లభ్ రెసిడెన్సీ, గాజులరామారం గ్రామం, వెంకటేశ్వర గార్డెన్ లేన్‌లో విద్యుత్ ఉండదని ఏఈ పేర్కొన్నారు.
రాయదుర్గం: టీఎన్‌జీఓ 11కేవీ విద్యుత్ ఫీడర్ పరిధిలో మరమ్మతుల కారణంగా సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు టీఎన్‌జీఓ కాలనీ, రంగారెడ్డి, కేంబ్రిడ్జి పాఠశాల, అలయ్‌బలయ్ చౌరస్తాలో విద్యుత్ ఉండదని అధికారులు తెలిపారు. అదే విధంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెక్రటేరియట్ కాలనీ, అలయ్‌బలయ్ చౌరస్తా, టీఎన్‌జీవో కాలనీ, కాళోజీ చౌరస్తాలో విద్యుత్ ఉండదన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
గుడ్ న్యూస్.. రూ.98 వేల దిగువకు బంగారం.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
ఎంపీ రఘునందన్‌కు మళ్లీ బెదిరింపు కాల్
Read Latest Telangana News and National News