Share News

Electricity: ఆ ఏరియాల్లో 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు కరెంటు సరఫరా బంద్..

ABN , Publish Date - Jul 26 , 2025 | 06:58 AM

చెట్ల కొమ్మల తొలగింపు, ఇతర మరమ్మతుల కారణంగా శనివారం వివిధ ఫీడర్ల పరిధిలో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు బోడుప్పల్‌ సబ్‌స్టేషన్‌ ఏఈ ఎన్‌.వేణుగోపాల్‌ తెలిపారు. అలాగే.. రామంతాపూర్‌ పాలిటెక్నిక్‌ సబ్‌ స్టేషన్‌ కేవీపీఎస్‌ కాలనీ ఫీడర్‌ పరిధిలోని శ్రీనివాసపురం ప్రాంతాలలో శనివారం మధ్యాహ్నం 12 నుంచి 12.30 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తామని ఏఈ కె.లావణ్య తెలిపారు.

Electricity: ఆ ఏరియాల్లో 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు కరెంటు సరఫరా బంద్..

  • నగరంలో నేడు విద్యుత్‌ సరఫరా ఉండని ప్రాంతాలు

హైదరాబాద్: చెట్ల కొమ్మల తొలగింపు, ఇతర మరమ్మతుల కారణంగా శనివారం వివిధ ఫీడర్ల పరిధిలో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు బోడుప్పల్‌ సబ్‌స్టేషన్‌ ఏఈ ఎన్‌.వేణుగోపాల్‌(Boduppal Substation AE N. Venugopal) తెలిపారు. మారుతీ నగర్‌ ఫీడర్‌ పరిధిలోని భవానీ నగర్‌, మారుతీ నగర్‌, మన్సానీ కాలనీ, గైలాక్స్‌ హోమ్స్‌, శ్రీసాయి ఎన్‌క్లేవ్‌, సిద్ధి వినాయక చిత్తారి, మణికంఠ నగర్‌, శుభోదయ కాలనీ, సుభాష్‌ నగర్‌, ఎస్సీ కాలనీలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కరెంటు సరఫరా ఉండదని అన్నారు.


కేవీఎస్బీఆర్‌, వివేకానంద ఫీడర్ల పరిధిలోని పడమటి కాలనీ, ఆర్‌ఎన్‌ఎస్ కాలనీ, బీఎల్‌ నగర్‌, రెడ్డీస్‌ కాలనీ, న్యూ భవానీ నగర్‌, శుభోదయ కాలనీ, గ్రీన్‌ సిటీ కాలనీ, అనఘాపురి కాలనీ, భీంరెడ్డి కాలనీ, ఎన్‌ఐఎన్‌ కాలనీ, వివేకానందనగర్‌, మణికంఠ నగర్‌, శ్రీలక్ష్మి నగర్‌, ఐఐసీటీ, అశోక్‌ నగర్‌లలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తామన్నారు. విద్యుత్‌ వినియోగదారులు తమ సిబ్బందితో సహకరించాలని ఆయన కోరారు.

- రామంతాపూర్‌ పాలిటెక్నిక్‌ సబ్‌ స్టేషన్‌ కేవీపీఎస్‌ కాలనీ ఫీడర్‌ పరిధిలోని శ్రీనివాసపురం ప్రాంతాలలో శనివారం మధ్యాహ్నం 12 నుంచి 12.30 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తామని ఏఈ కె.లావణ్య తెలిపారు.


పేట్‌బషీరాబాద్‌: ఫీడర్ల మరమ్మతు కారణంగా శనివారం పేట్‌బషీరాబాద్‌ సబ్‌స్టేషన్‌(Petbashirabad Substation) పరిధిలోని ఈ కింది ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదని ఏఈ జ్ఞానేశ్వర్‌ తెలిపారు. ఉదయం 11 నుంచి 11.30 గంటల వరకు జయరామ్‌నగర్‌, శ్రీకృష్ణానగర్‌, గణేష్ కాలనీ, జేకే నగర్‌, రుక్మిణి ఎస్టేట్స్‌ ప్రాంతాలో కరెంట్‌ ఉండదన్నారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు సుచిత్ర చౌరస్తా మెయిన్‌రోడ్డు, షాపింగ్‌ మాల్స్‌, కరాచీ బేకరీ , టీఎన్‌ఆర్‌ అపార్టుమెంట్స్‌ ప్రాంతాల్లో విద్యుత్‌ ఉండదన్నారు. అలాగే, కొంపల్లి సబ్‌స్టేషన్‌ పరిధిలో ఉదయం 11 నుంచి 12 గంటల వరకు జయభేరి, బ్యాంక్‌ కాలనీ, జయభేరి శివాలయం, శ్రీనివాస్‌ కాలనీ, ఎన్‌సీఎల్‌ నోబుల్‌ ఎన్‌క్లేవ్‌, ఎన్‌సీఎల్‌ కాలనీ, సినీప్లానెట్‌ రోడ్డు, కేవీఆర్‌ గార్డెన్‌, విజయశాంతి విల్లాస్‌, కొంపల్లి గ్రామంలో విద్యుత్‌ సరఫరా ఉండదని ఏఈ శ్రీనివాస్‌ వెల్లడించారు.


city1.2.jpg

నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలు..

చిక్కడపల్లి: ఆజామాబాద్‌ డివిజన్‌(Azamabad Division) పరిదిలో శనివారం విద్యుత్‌ సరఫరా ఉండదని ఏడీఈ నాగేశ్వరరావు తెలిపారు. గోల్నాక పరిధిలో ఉదయం 10 నుంచి 10.30 గంటల వరకు, బ్రాహ్మణ హాస్టల్‌ పరిదిలో 11.30 నుంచి 12.30 వరకు, ప్లేగ్రౌండ్‌ పరిధిలో 11.30 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సీఈ కాలనీ పరిధిలో మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు విద్యుత్‌ సరఫరా ఉండదని ఏడీఈ నాగేశ్వరరావు పేర్కొన్నారు.


ఏఎస్ రావునగర్‌: వెంకటేశ్వరనగర్‌ ఫీడర్‌లో సాంకేతిక మరమ్మతుల కారణంగాశనివారం ఆ ఫీడర్‌ పరిధిలోని పలు ప్రాంతాలలో విద్యుత్‌ సరఫరాలో కోత విధిస్తున్నట్లు మౌలాలి ఏఈ వెంకటరెడ్డి(Moulali AE Venkata Reddy) తెలిపారు. వెంకటేశ్వరనగర్‌, రాఘవేంద్రనగర్‌, ఇందిరానగర్‌, హెచ్‌బీ కాలనీ, ఎంఐజి, ఎల్‌ఐజీ, హెచ్‌ఐజీ, ఈడబ్ల్యుఎస్‌, డైమండ్‌ హిల్స్‌ తదితర కాలనీలలో ఉదయం 10.30 నుంచి 11 గంటల వరకు విద్యుత్‌ సరఫరాలో కోత విధిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి తమతో సహకరించాలని ఏఈ వెంకటరెడ్డి కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

యాదగిరిగుట్ట సత్యదేవుడి వ్రత టికెట్‌ ధర పెంపు

రాహుల్‌ది ఏ కులమో చెప్పు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 26 , 2025 | 09:43 AM