Share News

ఇంకా రుణమాఫీ కానీ ఆ రైతులకు మార్చిలో చేస్తాం: మంత్రి పొన్నం

ABN , Publish Date - Jan 24 , 2025 | 03:13 AM

రూ.2 లక్షలకు పైగా రుణాలుండి ఇంకా మాఫీ అమలు కానీ రైతులకు మార్చిలో షెడ్యూల్‌ పెట్టి చేస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

ఇంకా రుణమాఫీ కానీ ఆ రైతులకు మార్చిలో చేస్తాం: మంత్రి పొన్నం

హుస్నాబాద్‌, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): రూ.2 లక్షలకు పైగా రుణాలుండి ఇంకా మాఫీ అమలు కానీ రైతులకు మార్చిలో షెడ్యూల్‌ పెట్టి చేస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. గురువారం ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో జరిగిన ప్రజాపాలన వార్డు సభలో మాట్లాడారు. వార్డు, గ్రామ సభల్లో దరఖాస్తును స్వీకరించాలన్నారు. రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లలో ఎవరి జోక్యం ఉండదని, అర్హులైన వారందరికీ మంజూరు చేస్తామన్నారు. రేషన్‌ కార్డుల ప్రక్రియ నిరంతరం జరిగేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నామని చెప్పారు.

Updated Date - Jan 24 , 2025 | 03:13 AM