Ponguleti: కేంద్రం ఇళ్లు ఇచ్చినా ఇవ్వకున్నా సంతోషమే..!
ABN , Publish Date - Mar 16 , 2025 | 04:45 AM
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద కేంద్రం రాష్ట్రానికి ఇళ్లు ఇస్తే సంతోషమని.. ఇవ్వకపోయినా డబుల్ సంతోషమని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు.

ఇచ్చిన మాటకు కట్టుబడి ఎంతైనా భరిస్తాం
‘ఆంధ్రజ్యోతి’తో మంత్రి పొంగులేటి
హైదరాబాద్, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద కేంద్రం రాష్ట్రానికి ఇళ్లు ఇస్తే సంతోషమని.. ఇవ్వకపోయినా డబుల్ సంతోషమని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం అసెంబ్లీ ఆవరణలో మంత్రిని ‘ఆంధ్రజ్యోతి’ పలకరించింది. ఈ సందర్భంగా ఆయన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన అంశంపై మాట్లాడారు. కేంద్రం ఇళ్లను ఇచ్చినా ఇవ్వకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని చెప్పారు. ఈ విషయంలో ఏ మాత్రం వెనుకడుగు వేసేది లేదన్నారు. పేదల కోసం ఎంత భారమైనా భరిస్తామని స్పష్టం చేశారు.