Ponguleti : నిషేధిత భూములకూ ప్రత్యేక పోర్టల్
ABN , Publish Date - May 25 , 2025 | 04:09 AM
నిషేధిత జాబితాలోని భూములు రిజిస్ర్టేషన్ కాకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి చెప్పారు. భూభారతి తరహాలో ప్రత్యేకంగా పోర్టల్ ఏర్పాటు చేశామని, నిషేధిత భూముల వివరాలను అందులో పొందుపరుస్తున్నామని తెలిపారు.

ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసినా సమాచారం
ఫిర్యాదులొస్తే.. అధికారులపై చర్యలు
గ్రామ పాలనాధికారుల పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
హైదరాబాద్, మే 24 (ఆంధ్రజ్యోతి): నిషేధిత జాబితాలోని భూములు రిజిస్ర్టేషన్ కాకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి చెప్పారు. భూభారతి తరహాలో ప్రత్యేకంగా పోర్టల్ ఏర్పాటు చేశామని, నిషేధిత భూముల వివరాలను అందులో పొందుపరుస్తున్నామని తెలిపారు. ఎక్కడైనా నిషేధిత జాబితాలో ఉన్న భూమిని రిజిస్ర్టేషన్ చేస్తే క్షణాల్లో హైదరాబాద్‌లోని రిజిస్ర్టేషన్ శాఖ ప్రధాన కార్యాలయంలో తెలిసిపోయేలా ఆన్‌లైన్ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. నిషేధిత భూములను రిజిస్ర్టేషన్ చేసినట్లు అధికారులపై ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిషేధిత భూములు, రిజిస్ర్టేషన్ల స్లాట్ బుకింగ్, గ్రామ పాలనాధికారుల పరీక్ష తదితర అంశాలపై శనివారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.
గ్రామ పాలనాధికారుల ఎంపిక కోసం ఆదివారం నిర్వహించనున్న పరీక్షకు 5వేల మంది హాజరుకానుండగా, 33జిల్లా కేంద్రాల్లో పకడ్బందీగా ఏర్పాట్లు చేశామన్నారు. వీలైనంత త్వరగా వీరి సేవలను అందుబాటులోకి తెస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్‌బుకింగ్ అమలు చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు స్లాట్‌బుకింగ్ ద్వారా 36వేల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్లు అధికంగా జరిగే పటాన్‌చెరు, యాదగిరిగుట్ట, గండిపేట, ఇబ్రహీంపట్నం, సూర్యాపేట, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అదనపు సిబ్బందిని నియమించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇవి కూడా చదవండి
Government Doctor: భార్యను పుట్టింటికి పంపించి.. వేరే మగాళ్లతో ఇంట్లో ఆ వీడియోలు..
Telangana: కవిత చెప్పిన దెయ్యాలు వారే.. సామ సంచలన కామెంట్స్..