Kalpana: ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్యాయత్నం!
ABN , Publish Date - Mar 05 , 2025 | 02:53 AM
కేవలం గాయనిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా, నటిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ గాయకుల్లో కల్పన ఒకరు. 27 ఏళ్లుగా పాటలు పాడుతున్నారు. దేశవిదేశాల్లో 3000కు పైగా సంగీత ప్రదర్శనల్లో పాల్గొన్నారు.

నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలోకి
2 రోజులుగా తలుపులు తెరవకపోవడంతో
భర్తకు సమాచారమిచ్చిన సెక్యూరిటీ
ఆయన ఫోన్‌తో రంగంలోకి పోలీసులు
ఆస్పత్రికి తరలింపు.. వెంటిలేటర్‌పై చికిత్స
హైదర్‌నగర్, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ నేపథ్య గాయని కల్పన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కల్పన బహుభాషా నేపథ్య గాయని. కేవలం గాయనిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా, నటిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ గాయకుల్లో కల్పన ఒకరు. 27 ఏళ్లుగా పాటలు పాడుతున్నారు. దేశవిదేశాల్లో 3000కు పైగా సంగీత ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఆమె బిగ్‌బాస్ షోలో కూడా పాల్గొన్నారు. ఈటీవీ నిర్వహించిన స్వరాభిషేకం కార్యక్రమంతో ఆమె బుల్లితెర ప్రేక్షకులకు చేరువయ్యారు. మహాశివరాత్రి రోజున సంగారెడ్డిలో నిర్వహించిన సంగీత విభావరిలో పాల్గొని పాటలు పాడారు. ఆమె హైదరాబాద్‌లోని నిజాంపేటలో ఉన్న వర్టెక్స్ ప్రివిలేజ్ విల్లా్‌సలో నివాసం ఉంటున్నారు. రెండు రోజులుగా ఇంటి తలుపులు తెరుచుకోకపోవడంతో అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది అసోసియేషన్‌కు సమాచారం ఇచ్చారు. అసోసియేషన్ సభ్యులు ఆమెకు ఫోన్ చేస్తే స్పందించలేదు. దీంతో ఆమె భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పారు.
చెన్నైకి చెందిన ఆమె భర్త ప్రసాద్ కూడా మంగళవారం ఉదయం నుంచి ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఆయన కెపీహెచ్‌బీ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి ప్రధాన ద్వారం తీసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఇంటి వెనక వంట గది నుంచి లోపలికి వెళ్లారు. అప్పటికే కల్పన అపస్మారక స్థితిలో మంచంపై పడి ఉన్నారు.
ఆమె నిద్ర మాత్రలు మింగినట్లు గుర్తించారు. హుటాహుటిన కల్పనను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని.. ఆమె పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. కల్పన భర్త ప్రసాద్ కూడా ఆస్పత్రికి చేరుకున్నారు. అతన్ని పోలీసులు ఇంటికి తీసుకెళ్లి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న కల్పనను చూసేందుకు సునీత, గీతామాధురి, శ్రీకృష్ణ, కారుణ్య తదితరులు ఆస్పత్రికి వచ్చారు.
ఎన్నో ఆటుపోట్లు..
జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నానని కల్పన పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. 2010లో భర్తతో విడాకులు తీసుకున్న సమయంలో ఎదురైన సమస్యలతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని.. అప్పుడు ప్రముఖ గాయని చిత్ర తనకు ధైర్యం చెప్పారని ఓ ఇంటర్వ్యూలో కల్పన చెప్పారు. భర్తతో విడిపోయిన తర్వాత కుటుంబాన్ని పోషించుకోవడం కష్టమైందని, పిల్లలను చదివించుకోలేకపోయానని కూడా ఆమో ఇంటర్వ్యూలో వెల్లడించారు. చిత్ర సూచన మేరకు పాటల పోటీలో పాల్గొని గెలవడంతో తన కష్టాలు తీరాయని చెప్పారు. బలమైన వ్యక్తిత్వం ఉన్న మహిళగా కల్పనకు చిత్ర పరిశ్రమలో గుర్తింపు ఉందని, అలాంటి వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించారంటే ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుందని సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి
PM Modi: సింహం పిల్లలకు మోదీ ఫీడింగ్.. వీడియో వైరల్
Aurangazeb Row: ఔరంగజేబు వ్యాఖ్యల వివాదంపై అబూ అజ్మి క్షమాపణ
Bihar: అసెంబ్లీ ఎన్నికల వేళ.. మళ్లీ ఆయనకే బీజేపీ అధ్యక్ష పగ్గాలు
Bird flu: బర్డ్‌ఫ్లూపై కలెక్టర్ ఏమన్నారంటే..
Akhilesh Yadav: మనుషులా? మరబొమ్మలా?.. వారానికి 90 గంటల పనిపై అఖిలేష్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.