మా కుమారుడి ప్రాణాలు కాపాడండి
ABN , Publish Date - Jun 29 , 2025 | 04:16 AM
స్పైనల్ మస్కులర్ అట్రోపీ (ఎస్‌ఎంఏ) టైప్2 అనే అరుదైన జన్యువాధితో బాధపడుతున్న చిన్నారి వైద్యానికి చేయూతనివ్వాలని చిన్నారి తల్లిదండ్రులు దాతలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
దాతలకు తల్లిదండ్రుల విజ్ఞప్తి
స్పైనల్ మస్కులర్ అట్రోపీ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి వేద్
హైదరాబాద్ సిటీ, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): స్పైనల్ మస్కులర్ అట్రోపీ (ఎస్‌ఎంఏ) టైప్2 అనే అరుదైన జన్యువాధితో బాధపడుతున్న చిన్నారి వైద్యానికి చేయూతనివ్వాలని చిన్నారి తల్లిదండ్రులు దాతలకు విజ్ఞప్తి చేస్తున్నారు. హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లికి చెందిన భార్యభర్తలు సత్యవేద, సాయిరాంల కుమారుడు వేద్ (10 నెలలు) ఏడో నెలలో ఎస్‌ఎంఏ టైప్2 వ్యాధి భారిన పడ్డాడు. బాలుడికి ఒక డోసు ఔషధంతో ‘జోల్జెన్స్మా’ అనే జన్యు చికిత్స చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు.
ఆ ఔషధం ఖరీదు దాదాపు 9కోట్ల వరకు ఉంటుందని చెప్పడంతో ఇంపాక్ట్ క్రౌడ్ ఫండిగ్ ద్వారా నిధులను సమీకరిస్తున్నట్లు బాలుడి తల్లిదండ్రులు వివరించారు. దాతలు ముందుకు వచ్చి సాయం చేయాల్సిందిగా కోరుతున్నారు. సత్యవేద జొన్నడ, బ్యాంకు అకౌంట్ నంబర్ 50100820441712, ఐఎ్‌ఫఎ్‌సఈ కోడ్-హెచ్‌డీఎ్‌ఫసీ 0009698 నంబర్‌లో దాతలు విరాళాలు జమ చేయాల్సిందిగా సత్యవేద, సాయి రాం కోరుతున్నారు. వివరాలకు 9866228299, 9490969055 నంబర్లకు ఫోన్ చేయాలని కోరారు.