Panchayat Elections : వారంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్!
ABN , Publish Date - Feb 05 , 2025 | 04:40 AM
గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల వేడి మొదలుకానుంది. తాజా పరిణామాల నేపథ్యంలో మరో వారం రోజుల్లోనే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. బీసీ గణన, జనాభా ఆధారంగా వారికి రిజర్వేషన్లు కల్పించే అంశంపై ప్రభుత్వం ఒక స్పష్టతకు వచ్చిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఎంతో
‘కేంద్రం స్పందించకున్నా ఇక్కడే నిర్ణయం’ అంటూ బీసీ రిజర్వేషన్లపై సీఎం వ్యాఖ్యలతో జోరుగా ప్రచారం
హైదరాబాద్, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల వేడి మొదలుకానుంది. తాజా పరిణామాల నేపథ్యంలో మరో వారం రోజుల్లోనే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. బీసీ గణన, జనాభా ఆధారంగా వారికి రిజర్వేషన్లు కల్పించే అంశంపై ప్రభుత్వం ఒక స్పష్టతకు వచ్చిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఎంతో సమయం పట్టదని సమాచారం. వేగంగా ఎన్నికల ప్రక్రియ చేపట్టాలని కాంగ్రెస్ సర్కారు భావిస్తోందని, అందుకు అనుగుణంగానే అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ, కులగణన సర్వే నివేదికను మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలు అంశంపై ప్రసంగించిన ఆయన.. రాష్ట్రం చేస్తున్న ప్రతిపాదనపై కేంద్రం స్పందించకపోయినా తమ ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. అవసరమైతే పార్టీపరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్నారు. అయితే ఆ తరువాత అసెంబ్లీ చేసిన తీర్మానంలో దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కేంద్రాన్ని కోరింది తప్ప... రిజర్వేషన్లు 50 శాతానికి మించి పెంచుకునేలా చట్టం చేయాలని మాత్రం కోరలేదు. దీన్ని బట్టి పార్టీపరంగా 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే ఎన్నికలకు వెళాతారని తెలుస్తోంది. సీఎం వ్యాఖ్యల దృష్ట్యా ప్రభుత్వం రిజర్వేషన్ల ఖరారుపై ఓ నిర్ణయం తీసుకుంటుందని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం నిర్వహించడం.. కులగణన, అన్ని వర్గాల జనాభావంటి వివరాలు వెల్లడించిన నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు చేపట్టడం ఖాయమని గ్రామీణ ప్రాంతాల్లోని ఆశావహులు అభిప్రాయపడుతున్నారు. అయితే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల అమలుకు విధి విధానాలు రూపొందించడం, ఎన్నికలు ఎప్పుడు చేపట్టాలన్న అంశంపై నిర్ణయానికొచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ జారీ చేయాల్సి ఉంటుంది. దీని ఆధారంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎ్‌సఈసీ) పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతుంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు క్షేత్రస్థాయిలో ఎస్‌ఈసీ తగిన ఏర్పాట్లు చేసుకుంది. ఇదిలా ఉండగా, ముందుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతాయని, ఆ తర్వాతే సర్పంచ్ ఎన్నికలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం. కాగా, పంచాయతీరాజ్ సాధారణ ఎన్నికల నిర్వహణలో పాల్గొనే సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు ఎస్‌ఈసీ సిద్ధమవుతోంది. ఈ సిబ్బందికి ట్రైనర్లు శిక్షణ ఇస్తారు. ఈ ట్రైనర్లకు బుధవారం హైదరాబాద్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్‌ఈసీ తెలిపింది. జిల్లాకు 10 మంది చొప్పున పంపాలని కలెక్టర్లను కోరింది.
మరిన్ని వార్తల కోసం..
PM Modi: ఎవర్నీ వదిలిపెట్టలేదు.. ఆటాడుకున్న పీఎం
Maha Kumbh Mela 2025: కుంభమేళాకు ప్రధాని మోదీ.. పవిత్ర స్నానంతోపాటు ప్రత్యేక పూజలు
Delhi Elections: ఎన్నికలకు సిద్ధం.. 35,000 మంది పోలీసులు, సీసీ టీవీ నిఘా..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి