Asaduddin Owaisi: పాకిస్థాన్ బెదిరింపులపై మోదీ స్పందించాలి
ABN , Publish Date - Aug 13 , 2025 | 05:34 AM
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అణ్వాయుధ బెదిరింపులపై ప్రధాని మోదీ స్పందించాల్సిన అవసరం ఉందని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
రక్షణ శాఖకు బడ్జెట్ పెంచాలి: అసదుద్దీన్ ఒవైసీ
హైదరాబాద్, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అణ్వాయుధ బెదిరింపులపై ప్రధాని మోదీ స్పందించాల్సిన అవసరం ఉందని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. దాయాది దేశం పాకిస్థాన్ నుంచి మనకు నిరంతరం ముప్పు ఉన్నందున ఆ దేశానికి చెందిన ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుని అందుకు అనుగుణంగా మన దేశ రక్షణ వ్యవస్థను సంసిద్ధం చేయాలన్నారు. పాకిస్థాన్ సైనిక వ్యూహాలను పసిగట్టి అందుకు అనుగుణంగా భారత సైన్యాన్ని ఆధునికరించాల్సిన అవసరం కూడా ఉందన్నారు. రక్షణ బడ్జెట్‌ను సైతం అందుకు అనుగుణంగా పెంచాలని డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసిన బీఆర్ఎస్
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు
Read Latest Telangana News And Telugu News