Share News

అంతర్జాతీయ ప్రమాణాలతో ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం

ABN , Publish Date - Jan 30 , 2025 | 04:24 AM

అంతర్జాతీయ ప్రమాణాలతో ఉస్మానియా ఆస్పత్రి భవనాలను నిర్మించనున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం

  • 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలు: మంత్రి దామోదర

హైదరాబాద్‌, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ ప్రమాణాలతో ఉస్మానియా ఆస్పత్రి భవనాలను నిర్మించనున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. పోలీసు శాఖకు ఉన్న 38 ఎకరాల స్థలంలో 26.30 ఎకరాలను ఆస్పత్రి కోసం ఇచ్చిన ఆ శాఖకు, గోషామహల్‌ ప్రజలకు మంత్రి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆస్పత్రి భవనాల నిర్మాణంపై బుధవారం సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు.


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... 26.30 ఎకరాల్లో 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో విశాలమైన ఆస్పత్రి భవనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. ఇందులో 2,000 పడకలు అందుబాటులోకి వస్తాయన్నారు. అదనంగా మరో 8 విభాగాలను కొత్త ఆస్పత్రిలో ప్రారంభిస్తామని తెలిపారు. అన్ని రకాల డయాగ్నోసిస్‌ సేవలు ఒకే చోట అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

Updated Date - Jan 30 , 2025 | 04:24 AM