Ponnam Prabhakar: ఉద్యోగులను రెచ్చగొడుతున్న ప్రతిపక్షం పొన్నం
ABN , Publish Date - Jun 30 , 2025 | 07:05 AM
ప్రభుత్వ ఉద్యోగులను ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నేతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, కానీ వారు ప్రజా సంక్షేమం కోసం విజ్ఞతతో వ్యవహరిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అనుగుణంగా నడుస్తోందన్నారు.
హైదరాబాద్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగులను ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నేతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, కానీ వారు ప్రజా సంక్షేమం కోసం విజ్ఞతతో వ్యవహరిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అనుగుణంగా నడుస్తోందన్నారు. ఢిల్లీలో బీజేపీతో దోస్తీ చేస్తున్న బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేసిందని ప్రశ్నించారు. బాధ్యతా రహితంగా వ్యవహరించినందునే ఆ పార్టీకి ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో సున్నా సీట్లు ఇచ్చారని, అలాగే వ్యవహరిస్తే భవిష్యత్తులో కనుమరుగూ చేస్తారని విమర్శించారు.